పవర్ స్టార్ పై పిర్యాదు... అయితే...

BC leaders case on Pawan Kalyan

06:48 PM ON 30th August, 2016 By Mirchi Vilas

BC leaders case on Pawan Kalyan

జనసేన అధినేత, సినీ నటుడు పవన కల్యాణ్ పై బిసి సంఘ నేతలు పిర్యాదు చేసారు. ఇంతకీ ఎందుకంటే, కుల, మతాలను కించపరిచేలా తిరుపతి సభలో వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ బీసీ సంఘం, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగం ప్రకారం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్ల ద్వారా ప్రజలకు తగిన న్యాయం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, కులాల పేరెత్తితేనే తనకు మంట అంటూ పవనకల్యాణ్ వ్యాఖ్యానించారని తెలిపారు. పవన్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. అయితే ఈ ఫిర్యాదును కమిషన్ తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: టీచర్ ని చితకబాది బుద్ధి చెప్పిన అమ్మాయిలు(వీడియో)

ఇది కూడా చదవండి: ఈ 10 రకాల అమ్మాయిలతో డేటింగ్ చాలా డేంజర్

ఇది కూడా చదవండి: జుట్టు రాలటాన్ని ఈ సింపుల్ చిట్కాతో ఆపేయొచ్చు!

English summary

BC leaders case on Pawan Kalyan