భారత క్రికెట్ ప్లేయర్లకు  కొత్త గ్రేడ్లు

BCCI Announces New  Gradings

05:28 PM ON 10th November, 2015 By Mirchi Vilas

BCCI Announces New  Gradings

బిసిసిఐ వచ్చే సంవత్సర కాలానికి క్రికెటర్లకు కొత్త గ్రేడింగ్ లను విడుదల చేసింది. భారత వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని , టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ,స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లతో పాటు గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్న బాట్స్ మెన్ అజింక్య రహనే కు 'ఎ' గ్రేడ్ లో కాంట్రాక్టు లభించింది. గత కొంత కాలంగా వైఫల్యం చెందుతూ వస్తున్న భువనేశ్వర్ కుమార్ , సురేష్ రైనా లు 'ఎ' గ్రేడ్ నుండి 'బి ' గ్రేడ్ కు పడిపోయారు . ఇప్పటి వరకు ' బి ' గ్రేడ్ లో కొనసాగుతూ వచ్చిన రవీంద్ర జడేజా , ప్రజ్ఞాన్ ఓజా లు ' సి ' గ్రేడ్ కు పడిపోయారు . ' సి ' గ్రేడ్ లో ఉన్న ఏడుగురు యువ ఆటగాళ్ళు తమ కాంట్రాక్టులు కోల్పోయారు.

బిసిసిఐ తొలి సారిగా మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ లను ప్రకటించింది. ' ఎ ' గ్రేడ్ లో మిథాలిరాజ్, జులన్, హర్మన్ ప్రీత్, తిరుష్ కామిని లకు స్థానం లబించింది.మరో ఏడుగురు మహిళా క్రికెటర్లకు ' బి 'గ్రేడ్ లో స్థానం లబించింది .

English summary

BCCI Announces New  Gradings