కూలోడి ప్రేమలో పడిన రష్యన్ ఆఫీసర్... ఆ జంటను చూసి జనానికి షాక్.!

Beautiful russian officer marries Indian labourers son and changes his life

11:40 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Beautiful russian officer marries Indian labourers son and changes his life

ప్రేమకు హద్దులు ఉండవని అంటారు. ఇదే క్రమంలో చాలామంది విదేశీ వనితలు మనవాళ్ళ ప్రేమలో పడడం, అలాగే మనోళ్లు విదేశీ వనితల మోజులో పడడం చోస్తుంటాం. అయితే, మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న నరేంద్ర అనే వ్యక్తి ఆ ఊర్లో పనిలేకపోవడంతో పొట్టచేత పట్టుకొని పనికోసం గోవా వెళ్లాడు. అక్కడ బార్ లో బేరర్ గా జీతం కుదిరాడు. గోవా కాబట్టి, బార్ లకు అమ్మాయిలు, మహిళలు రావడం కామన్. ఎప్పటిలాగే తన పనిలో తాను ఉండగా, ఓ రష్యన్ అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది. బీర్ తెచ్చి, గ్లాస్ లో పోసి ఆమెకు అందించాడు.. ఏమైందో ఏమో కానీ ఆ క్షణం నుండి నరేంద్రను ఇష్టపడడం ఆ రష్యన్ అమ్మాయి వంతయింది.

1/4 Pages

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి గోవాలోని పార్క్ లు, బీచ్ లు తిరిగేశారు. అప్పటికే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. తర్వాత తెల్సిందేంటంటే, ఆ రష్యన్ అమ్మాయి పేరు ఆనస్తత రష్యన్ పార్లమెంట్ హౌజ్ లో ఎకానమిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగినిట. అంతేకాదు, తన ప్రేయసిని చూడడానికి నరేంద్ర రెండు సార్లు రష్యాలోని మాస్కోకు కూడా వెళ్లొచ్చాడట.

English summary

Beautiful russian officer marries Indian labourers son and changes his life