ఆన్‌లైన్‌లో బ్యూటీ ప్రొడక్ట్ ల హవా

Beauty Products Sales To increase $11 Billion In India

11:11 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Beauty Products Sales To increase $11 Billion In India

ఆన్ లైన్.. ఆన్ లైన్.. ఆన్ లైన్.. ప్రస్తుతం ఏవస్తువు కావాలన్నా.. ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా వస్తువుల అమ్మకం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, సౌందర్య సాధనాలను ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం 2020 నాటికి ఆన్‌లైన్‌ ద్వారా బ్యూటీ ప్రొడక్ట్ ల అమ్మకాలు 11 బిలియన్‌ డాలర్లకు చేరతాయట. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసే ప్రతీ మూడు వస్తువుల్లో ఈ జాబితాకు సంబంధించిన ఒక వస్తువు ఉంటోందట. బెయిన్‌ అండ్‌ కంపెనీ, గూగుల్‌ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా సౌందర్య సాధన ఉత్పత్తుల అమ్మకం పెరుగుతూ వస్తోంది. 2020 నాటికి వీటి కొనే భారతీయుల సంఖ్య 130 మిలియన్లకు చేరనుంది. కంపెనీలు ఉత్పత్తి చేసే వాటిలో 20శాతం ఆన్‌లైన్‌ ద్వారానే అమ్ముడుపోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2020 నాటికి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 650 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తుండగా, ఇందులో 200 మిలియన్లు మహిళలే ఉంటారట. ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాల అమ్మకాలు ఆన్‌లైన్‌లో మరింత వూపందుకోనున్నాయి.

English summary