రాహుల్ సభలో మంచాలు ఎత్తుకుపోయారు!

Beds taken from Rahul Gandhi sabha

06:50 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Beds taken from Rahul Gandhi sabha

ఒకటా రెండా ఏకంగా రెండువేల మంచాలు ఎత్తుకుపోయారు. పైగా వీటికోసం కొట్లాడుకున్నారు. పోనీ ఇదేదో పెళ్లి కోసమా అంటే అదీ కాదు... మరి ఎందుకంటే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సభకోసం ఈ మంచాలు తరలించారు. సభకు కుర్చీలు కావాలి కదా. మంచాలు ఏమిటి అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం..

1/4 Pages

సభకు తరలించారు...


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నుంచి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా దేవరియా జిల్లా రుద్రాపూర్ లో రైతులతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఖాట్ సభ పేరుతో నిర్వహించే ఈ సభలో రైతులు తీరిగ్గా కూర్చోవడానికి ఏకంగా 2వేల మంచాలను ఏర్పాటు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దేవరియా నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మహాయాత్రను మంగళవారం ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో(ఉత్తరప్రదేశ్ లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్ పర్యటిస్తారు. ఈ యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటిస్తారు. వారి నుంచి డిమాండ్లు వింటారు. అందుకనుగుణంగా పార్టీ మానిఫెస్టో ఉంటుంది.

English summary

Beds taken from Rahul Gandhi sabha