బీఫ్ ఉద్రిక్తత 

Beef Festival Contreversy In Osmania University

11:14 AM ON 10th December, 2015 By Mirchi Vilas

Beef Festival Contreversy In Osmania University

బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసినా , ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత అర్ధరాత్రి ఓయు హాస్టల్ లో పోలీసులు సోదాలు జరిపి , 16 మంది నిర్వాహకులను అరెస్టు చేసారు. ఫెస్టివల్ జరిపితీరతామంటూ నిర్వహాకులు చెబుతుంటే , అడ్డుకుని తీరతామని గోసంరక్షణ సమితి చెబుతోంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే అడ్డుకోడానికి రెండు వేల,మంది గోసంరక్షణ కార్యకర్తలను మూహరించినట్లు గోషామహల్ ఎంఎల్ఎ రాజా సింగ్ అన్నారు.

ఇక ఓయులో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే , కఠిన చర్యలు తప్పవని యూనివర్సిటీ రిజిస్త్రార్ స్పష్టం చేసారు. అంతేకాదు అడ్మిషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. పోలీసులు అరెస్టుల పర్వం సాగిస్తున్నారు. బిజెపి ఎంఎల్ఎ రాజా సింగ్ ని పోలీసులు అరెస్టు చేసి , షాహినా యత్ గంజ్ కి తరలించారు. ఓయు లోకి వెళ్ళే రహాదారులన్నీ మూసేశారు. మీడియాకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. రాజా సింగ్ ని అరెస్టు చేయడంతో బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలిస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళ దానికి సిద్దమవ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఒయులొకి వెళ్లేందుకు గోసంరక్షణ సమితి , భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని , పలువురిని అరెస్టు చేసారు.

ఇక లోయర్ టాంక్ బండ్ దగ్గర స్వామి పరిపూర్ణానంద గోపూజ నిర్వహించారు. గో సంరక్షణ బాధ్యత సమాజంలో అందరికీ వుందని ఆయన అన్నారు. గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

పూర్వ వివరాల్లోకి వెళితే, దేశంలో ఒకటి రెండు చోట్ల గో మాంసం తిన్నారన్న నెపంతో దాడులకు దిగడం , దీనిపై రగడ లేవడం చివరకు బీహార్ ఎన్నికల సందర్భంగా పెద్ద చర్చ కు దారితీయడం తెల్సిందే. ఈ నేపధ్యంలోనే దేశంలో పలు చోట్ల బీఫ్ ఫెస్టివల్ కి సన్నాహాలు చేసారు. ఓ యు లో కూడా డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ జరపాలని నిర్యించడంతో సహజంగానే దీనికి , పెద్దయెత్తున ప్రచారం కూడా కల్పించారు. బీఫ్ ఫెస్టివల్ కి ప్రతిగా పంది కూర పండగ కూడా నిర్వహించడానికి మరో వర్గం పిలుపు నిచ్చింది. ఇక బీఫ్ ఫెస్టివల్ ని అడ్డుకుంటామని ఎంఎల్ఎ రాజా సింగ్ ప్రకటించారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి రోజున కడెం రాజు దీనిపై కోర్టుని ఆశ్రయించడంతో బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి లేదని స్పష్టం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చర్యలు చేపట్టారు.

English summary

Beef festival which is to be held on osmania university today was cancelled due to high court said that there was no permission to beef festival. There were some contreversial issued going this festival