ఉస్మానియాలో 'బీఫ్' వేడి 

Beef Festival In Osmania University

01:00 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Beef Festival In Osmania University

గోమాంసం తినడానికి బీఫ్ ఫెస్టివల్ పేరిట ఓ వైపు ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు గోమాతను సంరక్షించాలని ఆందోళన రేగుతోంది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం మరోసారి వేడక్కనుంది. డిసెంబర్ 10న హైదరాబద్ ఉస్మానియా యూనివర్సిటీ లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు విద్యార్ధి సంఘాలు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే హైదరాబాద్ ఎంపి , మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసీ తదితర ప్రముఖులను బీఫ్ ఫెస్టివల్ కి నిర్వాహకులు ఆహ్వానించారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్ కి గడువు దగ్గర పడుతున్న నేపధ్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ శివసేన అదేరోజు గోమాత పూజకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసులు తగు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు.

English summary

Osmania Stdents To Held Beef Festival in Osmania University,Hyderabad. Assaduddin Owaisi also invited for this beef feastival. Siva Opposing this beef festival