పవర్ స్టార్ కి బీర్లతో అభిషేకం!

Beers bath for cutouts in Tamil Nadu

11:54 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Beers bath for cutouts in Tamil Nadu

అభిమాన నటుడు సినిమా విడుదల అవుతుంటే చేసే హడావిడి అంతా ఇంతా కాదు... వీర లెవెల్లో సందడి చేసేస్తారు. తెలుగులో అయితే మనోళ్లు కేవలం కటౌట్ పెట్టి, రిలాక్స్ అయిపోతారు. అంతకు మించి పెద్దగా హడావిడి చేయరు. కానీ తమిళోళ్లు అలా కాదు, తమిళనాడులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరీ ఓవర్ గా ఉంటుంది. గుళ్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, పూజలు చేయడం లాంటివి ఎన్నో చేసెయ్యడం వింటుంటాం. అయితే ఈ హడావిడి చూసి, కొన్ని రోజుల క్రితం పాలాభిషేకాల గురించి మద్రాస్ హైకోర్ట్ కాస్త గట్టిగానే మొట్టికాయ వేయడంతో ఫ్యాన్స్ పాల జోలికి వెళ్లలేదు. కోర్టు హమ్మయ్య అనుకునే లోపే, ఫ్యాన్స్ కు మరో వింత ఆలోచన వచ్చింది.

హాట్ డ్రింక్స్ లో కూల్ గా ఉండే బీర్లతోనూ, కూల్ డ్రింక్స్ తోనూ అభిషేకాలు మొదలెట్టేసారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ నటించిన 'తేరీ' సినిమా నిన్న తమిళనాట రిలీజైంది. ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ ఆయన కటౌట్లకు కూల్ డ్రింక్స్ తో అభిషేకాలు జరిపేశారట. ఇద్దరు ముగ్గురు వీరఫ్యాన్స్ అయితే బీర్ బాటిళ్లతో కటౌట్ కు స్నానం చేయించారట. అభిమానం ఉండచ్చు గానీ, మరీ ఇంతలాగా.. వామ్మో..!

English summary

Beers bath for cutouts in Tamil Nadu. Beers bath in Tamil Nadu for Ilayathalapathy Vijay Theri movie cutouts.