కత్తెరకు పదును లేకుండా చేసిన ఆ ముద్దులు

Befikre Movie Clears Censor Board With No Cuts

11:26 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Befikre Movie Clears Censor Board With No Cuts

ఒక్కోసారి చిన్న సీన్లు సైతం వివాదం అవుతాయి. ఇంకోసారి అసలు ఏమీ కాదన్నట్టు ఉంటాయి. దేనికైనా టైం బాబూ టైం అంటాం కదా. సరిగ్గా న్యూమూవీ బేఫిక ర్ విషయంలోనూ అదే జరిగింది. ఈ బాలీవుడ్ మూవీ ఇప్పటికే కుర్రకారుని హీటెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన ఓ పోస్టర్ సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రణవీర్ సింగ్- వాణీ కపూర్ జంటగా రానున్న ఈ రొమాంటిక్ ఫిల్మ్ కి 'దోజ్ హు డేర్ టు లవ్' అనే క్యాప్షన్ కూడా డైరెక్టర్ ఆదిత్యచోప్రా ఇచ్చేశాడు! డిసెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కూడా ఆదిత్య చోప్రానే! ఇక ఇందులో హీరో- హీరోయిన్ లిప్ లాక్స్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ సాగిపోతోంది.

వీళ్లిద్దరు కలిసే ప్రతి సన్నివేశంలోనూ డైరెక్టర్ లిప్ లాక్ సీన్ ని క్రియేట్ చేశాడట. ఆ లెక్కన సినిమా మొత్తం 23 సార్లు లిప్ లాక్ లున్నట్లు అంటున్నారు. ఒకప్పుడు సినిమాల్లో లైట్ గా కనిపించేది ఇలాంటి సీన్.. ఇప్పుడైతే నటీనటుల లిప్ లాక్ తో పోస్టర్స్ ని విడుదల చేయడం కొసమెరుపు. మొన్నటివరకు నాలుగు రకాల పోస్టర్స్ రాగా, లేటెస్ట్ గా వచ్చింది ఐదోది. గతంలోకంటే ఈసారి లిప్ లాక్ డోస్ పెరిగిందని ఫ్యాన్స్ అనేస్తున్నారు. మరి సెన్సార్ కత్తెరకు ఈ ముద్దులు పదును లేకుండా చేశాయా అనే కామెంట్లు పడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:ఆ కమెడియన్ తో జోడి కడుతున్న రెజీనా!

ఇవి కూడా చదవండి:చైతూపై తన ప్రేమని పబ్లిక్ గా చెప్పేసిన సమంత!

English summary

Aditya Chopra's Befirke Movie clears censor with no cuts and this movie was a good romantic entertainer and Ranveer Singh and Vani Kapoor were acted as hero heroines.