బిచ్చగాడికి లాటరీ.. రూ. 65 లక్షలు జాక్ పాట్

Beggar wins 65 lakhs lottery

09:36 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

Beggar wins 65 lakhs lottery

అతడు భిక్షగాడే కావచ్చు... కానీ అతడు ఇప్పుడు లక్షలకు అధిపతి అయ్యాడు... అది కూడా లాటరీలో... ఏకంగా 65 లక్షలు గెలుచుకుని జాక్ పాట్ కొట్టేసాడు. ఓసారి వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యకు ప్రస్తుతం కాలు లేకపోవడంతో కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు మార్తాండం(కేరళ) లో బిచ్చం ఎత్తుకుని జీవిస్తూ, కూడబెట్టిన సొమ్ములో కొంత సొమ్ము అనంతపురంలోని ఇంటికి పంపుతూ, మిగిలిన సొమ్ముతో లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు.. ప్రభుత్వ అనుమతితో అక్కడ లాటరీలు నడుస్తాయి. రెండు రోజుల క్రితం పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కి తీసుకెళ్ళారు.

ఇది కూడా చదవండి: అనుష్క ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబొతున్న ప్రభాస్?

అయితే పోలీసులతో పాటూ వెళ్ళిన ఓ వ్యక్తి అక్కడ అసలు విషయం చెప్పాడు. అతనెవరంటే పొన్నయ్యకు లాటరీ అమ్మిన వ్యక్తి.... పొన్నయ్యకు లాటరీ టికెట్ తగిలిందనే విషయం అతడు చెప్పేసరికి పొన్నయ్య ఆనందానికి అవదుల్లేవ్.. రూ. 65 లక్షలు లాటరీ తగిలిందని చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవ్వాడు... లాటరీ మొత్తం ఎక్కువగా ఉండడంతో పొన్నయ్య అనంతపురంలోని వారి కుటుంబ సభ్యులకు కబురు పెట్టడంతో గురువారం వాళ్ళ అన్నయ్య, నాన్న వచ్చి, డబ్బు పట్టుకెళ్లారు. ఇక ఈ డబ్బుతో పిల్లల కష్టాలు, ఇబ్బందులు గట్టెక్కుతాయని సహజంగానే పొన్నయ్య భావిస్తున్నాడు. అదృష్టం ఉంటే ఇలాగే వెతుక్కుంటూ వస్తుందేమో..

ఇది కూడా చదవండి: అనుష్క ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబొతున్న ప్రభాస్?

English summary

Beggar wins 65 lakhs lottery. A beggar in Kerala hits jackppot, he wins Rs. 65 lakhs lottery.