మరోసారి సాంప్రదాయంగా కనిపిస్తున్న సన్నీ లియోన్(వీడియో)

Beiimaan Love movie trailer

11:41 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Beiimaan Love movie trailer

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు అడల్ట్ చిత్రాలను(మస్తీజాదే, ఒన్ నైట్ స్టాండ్) విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్, తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతున్న బీమాన్ లవ్ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకు సన్నీలియోన్ అంటే ఎ సర్టిఫికేట్ సినిమాలకు మాత్రమే అన్న ఇమేజ్ ఉంది. అయితే బీమాన్ లవ్ చిత్రంలో మాత్రం.. వాటితో పాటు సాంప్రదాయ బద్ధమైన చీరకట్టులో కూడా తళుక్కుమంది.

కేవలం హాట్ హాట్ సన్నివేశాలను నమ్ముకుంటే లాభం లేదని గ్రహించి ఈ సారి అందాల ఆరబోతను తగ్గించి, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సన్నీలియోన్ ను ఒకే తరహా పాత్రలలో చూసి చూసి బోరు కొట్టిన ప్రేక్షకులకు ఈ ట్రైలర్ కాస్త ఊరటనిస్తోంది. మీరు కూడా ఒకసారి ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేసేయండి.

English summary

Beiimaan Love movie trailer