'తమన్నా' ను ఎంచుకున్నది అందుకా!

Bellamkonda Srinivas About Tamanna In His Movie

10:11 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Bellamkonda Srinivas About Tamanna In His Movie

తొలి అడుగులోనే డాన్సులు, పోరాటాలతో కుమ్మేసి. ఆ స్పీడు కి తగ్గట్టుగా రెండో సినిమాకే ‘స్పీడున్నోడు’ అనే టైటిల్ పెట్టిసి, శుక్రవారం ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. రీమేక్ సినిమాతో సందడి చేస్తున్న శ్రీనివాస్ మంచి జోష్ మీదున్నాడు. మొదటి సినిమాలో సమంత ని ఎంచుకున్న యితడు రెండో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను ఎంచుకున్నాడు. పైగా ఈమెకే ఎక్కువ ప్రాధాన్య కల్పిస్తూ, పబ్లిసేటీ ఇచ్చేసారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే , ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని నవ్వేసాడు. 'హీరోయిన్ కన్నా స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసిన తమన్నాకే ఎక్కువ ప్రచారం కల్పించడంలో పెద్దగా ప్రాధాన్యత అంటూ ఏదీ లేదు హీరోయిన్ కీ కూడా పెద్ద పోస్టర్లు వేశాం. అయినా ‘బాహుబలి’లో నటించిన తమన్నాకు ఆ మాత్రం పబ్లిసిటీ ఇవ్వడంలో తప్పు లేదు. పైగా తమన్నా నాకు స్నేహితురాలు. ఈ సినిమాలో ఓ పాటలో కనిపిస్తుంది. తెలుగు పరిశ్రమలో తమన్నాలా డాన్స్‌చేసే నాయికలు లేరు. అందుకే ఆమెను ఎంచుకొన్నా ' అంటూ అసలు విషయం చెప్పేసాడు. ఇక త్వరలోనే బోయపాటి శ్రీనుతో సినిమా కూడా మొదలవబోతోంది. కొండా విజయ్‌ కుమార్‌ కథ ఓకే కూడా అయ్యిందట. మరి ముచ్చట గా మూడో సినిమాలో కూడా ఇలాంటి ప్రయోగం ఏమైనా చేస్తాడో లేదు చూడాలి.

English summary

Recently actress Tamanna was acted in a Special song in Speedunnodu movie.The hero in this movie was Bellamkonda Srinivas.Bellamkonda Srinivas says that Tamanna is a very good dancer in film insdustry and thats the reason to show her in his Speedunnodu Movie