''అల్లుడుశీను'' కొత్త సినిమా!

Bellamkonda Srinivas new movie title

10:57 AM ON 14th December, 2015 By Mirchi Vilas

Bellamkonda Srinivas new movie title

'అల్లుడుశీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ చిత్రంలో తన డ్యాన్స్‌, ఫైట్స్తో మాస్‌ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్‌ రెండో సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరాపు దర్శకత్వం వహిస్తుండగా బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన సోనారికా బడోరియా హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'సుందర పాండ్యన్‌' చిత్రానికి ఇది రీమేక్‌. అయితే తెలుగులో దీనికి ఇంకా టైటిల్‌ ఖరారు చెయ్యలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే టైటిల్ను ఫిక్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ టైటిల్‌ కి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. అల్లుడుశీనులో ఐటమ్‌ సాంగ్‌ లో కనిపించిన తమన్నా ఈ చిత్రంలో కూడా ఒక ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుంది.

English summary

Bellamkonda Srinivas new movie title want to fix as Speedunnodu. This movie is directing by Bheemaneni SrinivasaRao.