కలబందతో అద్భుత ప్రయోజనాలు

Benefits of aloevera

11:39 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Benefits of aloevera

ఈ రోజుల్లో అద్భుత అందం మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలబంద ప్రతి ఇంటిలోనూ ఉండటం సర్వ సాధారణం అయ్యిపోయింది. ఇది మొటిమల చికిత్సలో మరియు సన్ బర్న్ తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబందతో చర్మ ప్రయోజనాలు

1. వృద్ధాప్య లక్షణాలను నిరోదిస్తుంది.
2. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
3. మొటిమలను తగ్గిస్తుంది.
4. సన్ బర్న్ మరియు చర్మ టాన్ ని తొలగిస్తుంది.
5. బాహ్య గాయాలు మరియు కీటకాల గాటులను నయం చేస్తుంది.                                                                                                                     6.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
7. చుండ్రును తగ్గిస్తుంది.
8. జుట్టు యొక్క pH సంతులనంను నిర్వహిస్తుంది.
9. జుట్టు చికిత్సలో సహాయపడుతుంది                                                                                                                                                 10. వాపును తగ్గిస్తుంది
11. గుండె మంటకు ఉపశమనం
12. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
13. నోటి ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.
14. రోగనిరోధక శక్తిని  మెరుగుపరుస్తుంది
15. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

1/16 Pages

చర్మ ప్రయోజనాలు

1. వృద్ధాప్య అకాల సంకేతాలను నిరోధిస్తుంది

వయస్సుతో పాటుగా లైన్స్ మరియు ముడతలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇతర కారణాల వలన కూడా ఈ సహజ ప్రక్రియ వేగవంతం అవుతుంది. కలబంద వృద్ధాప్య అకాల సంకేతాలను నిరోధిస్తుంది. కలబంద, ఆలివ్ నూనె మరియు వోట్మీల్ కలిగిన ఈ ప్యాక్ చర్మాన్ని సున్నితంగా, మృదువుగా మరియు తేమగా ఉంచుతుంది.

కావలసినవి

  • కలబంద - 1 స్పూన్
  • ఆలివ్ నూనె - ½ స్పూన్
  • వోట్మీల్ - 1 స్పూన్

పద్దతి

* ఒక బౌల్ లో కలబంద, ఆలివ్ నూనె, వోట్మిల్ వేసి బాగా కలపాలి.
* ఈ పేస్ట్ ని ముఖానికి రాయాలి.
* అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కాలక్రమేణా, చర్మం ఎండిపోయి మరియు దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. దాంతో ముడతలు మరియు లైన్స్ రావటానికి కారణం అవుతుంది. కలబంద చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచి మృత కణాలను తొలగిస్తుంది. నిజానికి, ఒక పరిశోధనలో కలబంద చర్మం యొక్క  స్థితిస్థాపకతను మెరుగుపరచి  మృదువైన మరియు మరింత సౌకర్యవంతముగా చేస్తుందని తెలిసింది.

English summary

Here are the some beauty tips and also health tips. That is uses of aloevera. Aloe vera gel was presented by many as their favorite moisturizer. He had miraculous effects on oily skin and acne.