అవోకాడో విత్తనాలలో ఉన్న ప్రయోజనాలు

Benefits of Avocado Seeds

12:26 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Benefits of Avocado Seeds

అవోకాడోను చాలా మంది ఇష్టపడే సూపర్ ఆహారం అని చెప్పవచ్చు. పండిన అవోకాడోను శాండ్విచ్లు, స్మూతీస్, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. అంతేకాక ఫేస్ పాక్స్ లలో కూడా ఉపయోగిస్తారు. అయితే అవోకడో విత్తనాన్ని దూరంగా పడేస్తూ ఉంటాం. కానీ దానిలో  యాంటిఆక్సిడెంట్, ఫైబర్ మరియు ఫినోలిక్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది. ఈ విత్తనాలు చేదు మరియు వగరు రుచిలో ఉంటాయి. వీటిని తినటానికి ముందు గోధుమరంగు పొరను తొలగించాలి. ఈ విత్తనాలను పొడిగా చేసుకోవాలి. ఈ పొడితో సలాడ్లు, సూప్ లను గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే జ్యూస్ లేదా స్మూతీ వంటకంలో ఈ పొడిని కలపవచ్చు. రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ అవోకడో విత్తనాల పొడిని వేసి మరిగించి వడకట్టి త్రాగవచ్చు. ఇప్పుడు అవోకాడో విత్తనాలలో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

అవోకాడో విత్తనాలలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. నిజానికి పండులో కంటే విత్తనంలోనే 70 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీఆక్సిడాంట్లు ఫ్రీ రాడికల్స్ ని దూరం చేసి,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి బాక్టీరియా, వైరల్ అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.

సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ నిర్వహించిన 2004 అధ్యయనంలో మామిడి, చింత,సీతాఫలం వంటి విత్తనాలలో కన్నా అవోకాడో విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని తెలిసింది.  రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేసుకోవటానికి మరియు జలుబు మరియు ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఒక స్పూన్ అవోకాడో విత్తనాల పొడిని చేర్చాలి.

English summary

In this article, we have listed about benefits of avocado seeds. Avocado seeds have strong antioxidant properties. In fact, the seeds contain more than 70 percent of the antioxidants found in the entire fruit.