డార్క్ చాక్లెట్ ప్రయోజనాలు

Benefits of dark chocolate

06:56 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Benefits of dark chocolate

డార్క్ చాక్లెట్ ని కోకో బీన్స్ నుండి తయారుచేస్తారు. ఇది కొంచెం  చేదుగా ఉండటం వలన, దీని రుచి చాలా మందికి నచ్చదు. అయితే దీనిలో అనేక ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి.  డార్క్ చాక్లెట్ లో శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ మరియు అనేక ముఖ్యమైన పోషకాలు ఉండుట వలన మనల్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచటానికి సహాయపడుతుంది.

అంతేకాక శక్తివంతమైన ఫ్లవనయిడ్స్  కార్డియో వాస్కులర్ ఇబ్బందులను నివారించటానికి మరియు స్ట్రోకులను తగ్గించటానికి సహాయపడతాయి. అంతేకాక మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించటానికి  మరియు రక్తపోటు స్థాయిలు స్థిరంగా ఉంచటానికి సహాయం చేస్తాయి. ఆరోగ్య సంరక్షణతో పాటు, డార్క్ చాక్లెట్ అనేక సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే చర్మం మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

1/13 Pages

డార్క్ చాక్లెట్: చర్మ ప్రయోజనాలు

1. డార్క్ చాక్లెట్, చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం,  ప్రకాశవంతంగా మరియు లోపరహితంగా ఉంచటానికి  సహాయపడుతుంది. ఇక్కడ డార్క్ చాక్లెట్ వలన కలిగే అద్భుతమైన చర్మ ప్రయోజనాలు ఉన్నాయి.
2. డార్క్ చాక్లెట్ లో ఉండే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ నష్టం నుండి చర్మాన్ని రక్షించి, మృదువుగా ఉండేలా చేస్తుంది.
3. డార్క్ చాక్లెట్ లో సూర్యుని నుంచి రక్షణ కలిగించే లక్షణాలు ఉండుటవలన, హానికరమైన UV కిరణాలకు వ్యతిరేకంగా చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాక సూర్యుని వేడి మరియు చర్మ క్యాన్సర్ వంటి పరిస్థితులను నివారించటానికి సహాయపడుతుంది.
4. డార్క్ చాక్లెట్ సాధారణ వినియోగంతో మృదువైన చర్మం మరియు మంచి ఛాయను సొంతం చేసుకోవచ్చు. అంతేకాక చర్మాన్ని తేమగా మరియు మంచి పోషణతో ఉంచుతుంది.
5. డార్క్ చాక్లెట్ కెఫిన్ తో కలిపి ఒక అద్భుతమైన చర్మ నిర్విషీకరణ ఏజెంట్ గా పనిచేస్తుంది. మృత కణాలను తొలగించి చర్మం తాజాగా ఉండేలా సహాయం చేస్తుంది.
6. డార్క్ చాక్లెట్ లో అద్భుతమైన ఒత్తిడి ఉపశమన లక్షణాలు ఉండుట వలన ఒత్తిడి హార్మోన్లను తగ్గించి చర్మ మంట ఉపశమనంలో సహాయపడుతుంది.

English summary

Here are the health benefits of dark chocolate.  Dark chocolate is a skin-friendly ingredient that helps keeping your skin healthy, glowing and just flawless. Check out few outstanding benefits of dark chocolate for skin and hair here.