అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు

Benefits of Ginger foe Beauty

06:23 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Benefits of Ginger foe Beauty

అల్లం అందరికీ తెలిసిన పదార్ధమే. అది కూరలలో వేస్తే మసాలా ఘాటును, గుబాళింపును తెస్తుందో అలాగే చర్మ సౌందర్యానికి కూడా అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా. అల్లంలో ఆంటీసెప్టిక్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వయస్సు పైబడడం వలన వచ్చే ముడతలను, కాలడం వలన వచ్చే మచ్చలను, మొటిమలను, చుండ్రు, చిట్లిపోయిన జుట్టు, జుట్టురాలడం వంటి సమస్యలను నివారిస్తుంది. చర్మం కాలవ్యవధిని పెంచుతుందిఅల్లంలో సరిపడినంత ఆంటీ యాక్సిడెన్స్‌ ఉండడం వలన శరీరానికి విషపధార్దాలు నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే రక్తం సరఫరాని క్రమబద్ధం చేస్తుంది. ఆంటీ యాక్సిడెంట్స్‌ ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేస్తాయి. చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అల్లం డల్‌స్కిన్‌, చిన్న గీతలు, ముడతలు వంటి సమస్యలతో పోరాడి స్కిన్‌ని యవ్వనంగా చేస్తుంది.మొటిమల నివారిణి అల్లం మొటిమలతో పాటు మచ్చలని కూడా మాయం చేస్తుంది. దీంటో ఆంటిసెప్టిక్‌ గుణాలు ఉండడం వలన డీప్‌ క్లెన్సర్‌గా పనిచేస్తూ మరియు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది డెడ్‌ స్కిన్‌ని పోగొట్టి చర్మాన్ని నిగారించేలా చేస్తుంది. చుండ్రును పోగొడుతుంది.అల్లంలో ఆంటిసెప్టిక్‌ గుణాలు ఉండడం వలన తలలో ఉన్న ఇన్ఫెక్షన్‌ని తగ్గించి చుండ్రు సమస్యనుండి బయటపడేస్తుంది. చుండ్రు సమస్యకి ఇంకొక పరిష్కారం ఆపిల్‌ సైడర్‌ వెనీగర్‌. దీనవల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు పెరుగుదల రోజు అల్లం వాడడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టుని వత్తుగా పెరిగేలా చేస్తుంది. దీనితో పాటు కోల్పోయిన జీవాన్ని తిరిగి తెస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. పాస్పరస్‌, జింక్‌ విటమిన్స్‌ వంటి పోషకాలను అందిస్తుంది.  అల్లం కాలిపోయిన చర్మాన్ని కూడా నునుపుగా చేస్తుంది.  అల్లం ఒక మంచి ఔషదవాహిని. కాలిపోయిన చర్మానికి దీన్ని వాడడం వలన మంచి ఫలితం వస్తుంది. 

1/3 Pages

ఉపయోగించే విధానం

అల్లం, తేనె మరియు లెమన్‌ మాస్క్‌

 నిమ్మకాయలో ఆంటీ ఫంగల్‌ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమల వల్ల కలిగే మచ్చలను పోగొడుతుంది. రెండు ముక్కల అల్లం పేస్ట్‌ని 2 టేబుల్‌ స్పూన్‌ల తేనెలో కలిపి దీనికి నిమ్మరసాన్ని జోడించి ఫ్రిజ్‌లో 30నిముషాల పాటు ఉంచాలి.  తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖం మొత్తం రాసుకుని కొంచెం సమయం తరువాత శుభ్రపరచుకోవాలి.

అల్లం, తేనె మరియు గ్లిజరిన్‌ ప్యాక్‌ : అల్లం తేనె మరియు గ్లిజరిన్‌..ఇవి చర్మాన్ని పొడబారకుంగా చూస్తాయి. పొడిబారిన చర్మాన్ని జీవం సంతరించుకునేలా చేస్తాయి. తరిగిన అల్లం అందులో 3 టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో అర కప్పు వెల్లుల్లి వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కొంచెం సమయం గడిచాక శుభ్రంగా కడగాలి. 

English summary

Benefits of Ginger for Beauty