ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

Benefits of Grapes

06:05 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Benefits of Grapes

'పండ్లలో రాణి" గా పేరు గాంచిన  వైటేసి కుటుంబానికి చెందిన  ద్రాక్ష రంగును బట్టి ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు / నీలం అనే మూడు రకాలుగా విభజించారు. మన ఆహారంలో ద్రాక్షను చేరిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి మరియు తక్షణ శక్తిని అందించే సాధారణ చక్కెరలు ఉంటాయి.

1/18 Pages

ద్రాక్షతో చర్మ ప్రయోజనాలు

1. సూర్య కిరణాల నుండి రక్షణ

ద్రాక్ష సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించటానికి ఉత్తమమైన ఇంటి నివారిణిగా ఉంది.

కావలసినవి

  • కొంచెం  గుజ్జు ద్రాక్ష

పద్దతి

  • ద్రాక్ష గుజ్జును ప్రభావిత ప్రాంతంలో నిదానంగా రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

ద్రాక్షలో ప్రొనాంథోసైనిడిన్‌ మరియు రెస్వెట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. చర్మంపై ద్రాక్ష రసాన్ని రాసినప్పుడు హానికరమైన అతినీలలోహిత వికిరణం నుండి రక్షణను అందిస్తుంది. సూర్యరశ్మి కారణంగా వచ్చే ఎరుపుదనం తగ్గటానికి సన్ స్క్రిన్ లోషన్ రాయాలి. అంతేకాక దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాల పునరుద్దరణకు సహాయపడుతుంది.

English summary

Here are the health benefits of grapes. They contain antioxidants that are anti-inflammatory, immunity-boosting vitamin C, and simple sugars that provide instant energy. Grapes not only add vibrance and appeal to your food but are also abundantly beneficial.