తులసి నీళ్లలో పసుపు కలుపుకుని తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు!

Benefits of holy basil and turmeric water

02:58 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Benefits of holy basil and turmeric water

ప్రకృతిలో వుండే ఎన్నో ఆకులు అలములు మన ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇక తులసి ఆకులోని ఆధ్మాత్మిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు చెప్పలేనివి కాదు. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలు, దాని ద్వారా వచ్చే సువాసనే, మనలో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతటి గొప్ప ప్రయోజనాలున్న ఆ మొక్కను తింటే పొందే ప్రయోజనాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందించే తులసి ఆకు రసంలో.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పసుపు కలిపి తీసుకుంటే, రకరకాల వ్యాధులను నయం చేయవచ్చు. అంతేకాదు, ఈ కాలంలో చాలామంది చాలా త్వరగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ప్రతిసారీ డాక్టర్ దగ్గరకు వెళ్లడం కూడా కష్టమైనపనే. కాబట్టి అనేక వ్యాధులను నిరోధించడానికి, ఇంట్లోనే కొన్ని న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం అద్భుతమైన పరిష్కారం. అలాంటి అమేజింగ్ సొల్యూషనే, తులసి వాటర్/పసుపు. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. ముందుగా కొన్ని నీటిని వేడిచేయాలి. కొన్ని తులసి ఆకులు, ఒక టీస్పూన్ పసుపు కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఈ డ్రింక్, ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిదట. 

1/13 Pages

దగ్గు..


తులసి, పసుపు మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గొంతులో ఇన్ల్ఫమేషన్ తగ్గడమే కాకుండా, దగ్గుకి కారణమయ్యే ఫ్లమ్ తొలగిపోతుందని అంటున్నారు.

English summary

Benefits of holy basil and turmeric water