పసుపు వల్లకలిగే లాభనష్టాలు

Benefits of Turmeric power

05:28 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Benefits of Turmeric power

పసుపు దుంప నుండి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు పొడిని తయారుచేస్తారు. భారతదేశంలో పురాతన కాలం నుండి  సౌందర్య ప్రయోజనాల కోసం, ఔషధ లక్షణాలు కోసం మరియు ఆహారంలో రంగు,రుచి కోసం పసుపును వాడుతున్నారు. దాదాపుగా అన్ని భారతీయ కూరలలో వాడుతున్న పసుపులో కేలరీలు మరియు కొలెస్ట్రాల్ ఉండవు. పసుపులో పీచు పదార్థం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి.

1/11 Pages

పసుపులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

పసుపులో ఉండే 'కర్‌క్యుమిన్' అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపు మీద అనేక పరిశోదనలు చేసి మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే పసుపులో రోగనిరోధక శక్తిని  పెంచే యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉన్నాయి.

వ్యాధినిరోధక శక్తిని పెంచడం

కర్‌క్యుమిన్ లో భారీ చికిత్స విలువలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెంచడం అనేది కర్‌క్యుమిన్ యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. విటమిన్ C కంటే 5 నుంచి 8 రెట్లు ఎక్కువ బలంగా విటమిన్ E ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్ అవరోధాలను అధిగమించి  రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడానికి మరియు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాక  అలెర్జీ, ఆస్తమా, అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వ్యాధి, మధుమేహం, మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంది.

English summary

Here are the benefits of turmeric powder. Turmeric powder is highly therapeutic and is used in various drugs.