ప్రతీరోజూ నడకతో ఎంతో మేలు

Benefits of walking

03:11 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Benefits of walking

బరువు తగ్గడానికి చాలా మంది భోజనం తగ్గించడం మీదే శ్రద్ధ చూపుతారు. భోజనం మీదే కాకుండా తగ్గడానికి చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి. వాటిమీద దృష్టి సాధిస్తే ఇక అందమైన శరీకాకృతి మీ సొంతం అవుతుంది. వ్యాయామాలను చేయడం చాలా మంచిది. పొద్దునే లేవడం, వ్యాయామాలు చేయడం వలన శరీరం దృడత్వాన్ని సంతరించుకుంటుంది. శరీరాన్ని తమకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి కొంత మంది తమ వయస్సుకి సరిపడని బరువులు ఎత్తి జిమ్‌లలో కష్టపడుతూ ఉంటారు. లావుగా ఉన్నవారు తమ శరీర బరువుని తగ్గించేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు తెల్లవారు జామున లేచి కొంచెం దూరం నడవడం అలవాటు చేసుకోవాలి. అలా రోజురోజుకి దూరాన్ని పెంచుకోవాలి. అలా అని చెప్పి ఒక్క రోజులో తగ్గిపోవాలని ఆశపడి ఒకే రోజు ఎక్కువ నడవకూడదు. ఏదైనా కష్టాన్నిబట్టే ఫలితం ఉంటుంది. రోజు నడవడం వలన శరీరంలో అధికమోతాదులో ఉన్న కొవ్వు కరుగుతుంది. మీరు ఒక గంట నడవడం వలన 400 కేలరీలు కరుగుతాయి. ఇలా రోజు చేయటం వలన మీరు ఫిట్‌గా ఉండడంతో పాటు ఆరోగ్య వంతమైన శరీరం లభిస్తుంది.

ఉదయం లేదా సాయంకాలం వేళలలో నడవడం వలన శరీరానికి డి విటమిన్‌ కూడా లభిస్తుంది.దీని వలన ఎముకలు దృడంగా తయారవుతాయి. నడవడం ప్రారంబించాలి అనుకున్న వారు ఒక నిర్ధిస్థమైన సమయం నిర్ణయించుకుని ఉదయం లేదా సాయంకాలం లేదా రెండు పూటలు చేయాలా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో తమకు సౌకర్యంగా ఉండే దుస్తులన, ఇంకా కాళ్ళకు షూస్‌ ని దరించి నడవడం మంచిది. నడక చేసే మేలు పలు రకాలు. నడవడం వలన కలిగే లాభాలు ఏంటో చూద్ధాం.

అతి తిండి మీద ద్యాస మళ్ళిస్తుంది :

కొంత మంది స్వీట్స్‌, స్నాక్స్‌ ఇలాంటి వాటిని చూస్తే తినకుండా ఉండలేరు. తర్వాత అయ్యో అనవసరం గా తిన్నామే అని నాలుక కరుచుకుంటారు. నడవడం వలన మీ శక్తి మరింత పెరుగుతుంది. మీరు అనుకున్న విధంగా మీ కోరికలను అదుపులో ఉంచుకుంటారు. తిండి మీద ద్యాస లేకుండా చేస్తుంది వాకింగ్‌ చేయడం వలన మీ కోరికలను అదుపులో ఉంచుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమి సమస్య ని అరికడుతుంది:

కొంత మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది.దానివల్ల వారు సరిగా నిద్ర పోరు. అందువల్ల ఉదయానికి నీరసించి ఆ రోజంతా నీరసంగానే ఉంటారు. అదేమళ్ళీ తరువాతి రోజు మీద ప్రభావం చూపుతుంది. జాబ్‌ చేసేవారికి ఇదొక పెద్ధ సమస్య అనే చెప్పాలి. అలసిపోయి వచ్చి నిద్ర రాక చాలా చికాకుగా ఉంటుంది. సాప్ట్‌వేర్‌ రంగంలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు రోజు ఉదయం, సాయంకాలం ఒక గంట లేదా అరగంట నడవడం చాలా మంచిది. దాని వల్ల చక్కగా నిద్ర వస్తుందని పరిశోదనలలో తేలింది.నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని 8 గంటలు నిద్రించడం మంచిదని పరిశోదకులు తెలియజేసారు. వాకింగ్‌ చేయడంవలన మంచి ఫలితం ఉంటుందని, ఉదయం వాకింగ్‌ చేసే వారు రాత్రుళ్లు సొమ్మసిల్లి నిద్రపోతున్నారని ఇటీవల ఒక పత్రికలో తెలిపారు.

చక్కటి ఆరోగ్యం:

వాకింగ్‌ చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రన్నింగ్‌ చేయగలిగిన వారు చమటలు పట్టే వరకు రన్‌ చేయడం వలన మంచి ఫలితం పొందుతారు. మీరు వాకింగ్‌ చేయడం మొదలు పెట్టారంటే దాని అర్ధం మీశరీరం ఆరోగ్యవంతంగా మారడానికి సిద్ధంగా ఉందని.

ఆహారం తీసుకునే పద్దతి:

సామాన్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నం మళ్ళీ రాత్రికి అన్నం తినడం అందరికీ అలవాటు అయిన పద్ధతి అలా కాకుండా సాయంకాలం సమయం లో మధ్యాహ్న బోజనం గడిచిన కొంచెం సమయం తరువాత అల్పాహారం తీసుకోవటం వలన రాత్రి భోజనం తక్కువగా తింటారు. దాని వలన బరువు తగ్గుతారు. ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. నడవడం వలన ఆహారం పై ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు కచ్చితంగా తిండిని అదుపు చేసుకొని తినడం అలవాటు చేసుకుటారని వాకింగ్‌ వల్ల సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.

మానసిక వత్తిడి:

వాకింగ్ చేస్తూ మదురమైన పాటలను వినడం వలన మనస్సుకి ఎంతో ఆహ్లాదకరంగాను, ఇంకా ప్రశాంతంగాను ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల మానసిక వత్తిడి కూడా దూరం అవుతుంది. చాలా మంది ఎప్పుడూ వారితో పాటు ఏదో ఒక తిండి పదార్దాలను తీసుకు వెళ్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా తింటూ ఉంటారు. వీరికి తిండి ని అదుపు చూసేకోవడం చాలా కష్టం. వాకింగ్ చేయడం వలన తిండి మీద ద్యాస ని మళ్ళిస్తుంది.

డబ్బు ఖర్చు లేకుండా సులువైన పద్దతిలో ఆరోగ్యకరంగా తయారవ్వాలంటే ఇదే అద్బుతమైన పద్దతి.

English summary

Benefits of walking. Walking can burn up to 400 calories an hour. Already know that walking can put you on the path to weight loss.