రిలీజ్‌కు ముందే 'బెంగాల్‌ టైగర్'కు కాసుల వర్షం!

Bengal Tiger Satellite rights bought by tv channel

03:16 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Bengal Tiger Satellite rights bought by tv channel

మాస్‌ మహా రాజ్‌ రవితేజ నటించిన తాజా చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రచ్చ ఫేమ్‌ సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. గత కొద్ది కాలంగా సరైన హిట్స్‌ లేక సతమతమవుతున్న రవితేజ ఈ ఏడాది రిలీజైన కిక్‌-2 పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అది బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరచడంతో ఇప్పడు బెంగాల్‌ టైగర్‌ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనార్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు (డిసెంబర్‌10) విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా చేస్తుంది బెంగాల్ టైగర్ టీమ్‌.

ఇదిలా ఉండగా బెంగాల్‌ టైగర్‌ శాటిలైట్ రైట్స్‌ రిలీజ్‌కు ముందే అమ్ముడైపోయాయి. ఈ శాటిలైట్ రైట్స్‌ కోసం ప్రముఖ టీవీఛానెళ్లు పోటీ పడగా చివరికి 'జెమిని టీవీ' ఛానెల్‌ ఏకంగా 7.5 కోట్లుకి శాటిలైట్‌ హక్కులని కొనేసుకుంది. రిలీజ్‌కు ముందే రవితేజ కెరీర్‌లో ఈ స్ధాయిలో అమ్ముడైన చిత్రం ఇదే కావడం విశేషం. రేపు (డిసెంబర్‌ 10) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

English summary

Bengal Tiger Satellite rights bought by Gemini tv channel with 7.5 crores.