19 రూపాయలకే బెంజ్, పోర్షే కార్లు

Benz and Porsche cars for only 19 rupees

11:33 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Benz and Porsche cars for only 19 rupees

ఆ ఆ ఆగండి రూ. 19కే బెంజ్, బీయమ్డబ్ల్యూలు అంటే అంత తక్కువకు అమ్ముతారని కాదు, అంత తక్కువ రేటుకే వాటిల్లో ఎక్కించుకుని తిప్పుతారని దానర్థం. మీ అందరికి ఓలా ఉబర్ గురించి తెలిసే ఉంటుంది, వీటి మధ్య నెలకొన్న పోటీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఓలా ఆటో, కారు, సెడాన్ అంటూ అన్ని రకాల కార్లను అందుబాటులోకి తెచ్చి ఆటో రేటుకే కార్లలో తిరిగే అవకాశాన్ని కల్పించింది. ఎంత కార్లలో తిరిగినా బెంజ్, బీయమ్డబ్ల్యూ, పోర్షే వంటి ఖరీదైన లగ్జరీ కార్లలో తిరిగితే వచ్చే కిక్కే వేరు. అలా అని ఆ కార్లను కొనడం అంత ఈజీ కాదు. మరి వాటిల్లో తిరగడం ఎలా? మీరేం వర్రీ అవకండి మేం ఉన్నాం అంటుంది ఓలా కార్స్.

కేవలం కిలోమీటరుకు 19 రూపాయలకే ఖరీదైన కార్లలో తిరిగే సౌకర్యాన్ని ఓలా కల్పిస్తుంది. ఇప్పటికే అతి తక్కువ రేటుకే క్యాబ్లు, సెడాన్లలో ప్రయాణ సౌకర్యాన్ని ఓలా అందిస్తున్న సంగతి తెలిసిందే. సో.. మీకు ఖరీదైన కార్ లో తిరగాలంటే, వెంటనే ఓలా ఓపెన్ చేసి బుక్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. మంచి తరుణం మించి పోనీయకండి.

English summary

Benz and Porsche cars for only 19 rupees