ప్రియురాలికి ప్రపోజ్ చేసిన తీరు చూస్తే షాకవ్వాల్సిందే(వీడియో)

Best proposal ever

11:51 AM ON 9th November, 2016 By Mirchi Vilas

Best proposal ever

వెర్రి వేయి విధాలు అన్నారు కదా. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. తన ప్రియురాలికి ఓ ప్రియుడు చేసిన ప్రపోజ్ అలాంటిదే మరి. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆస్ట్రేలియాలోని మొసళ్ల పెంపక కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడు. బిల్ కొల్లెట్ అనే యువకుడు మొసళ్ల ఎన్ క్లోజర్ లో నాలుగున్నర మీటర్ల దూరంలో ఎల్వీస్ అనే మొసలి ఉండగా, అక్కడే మోకాళ్లపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్ చేసి అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. బిల్ కొల్లెట్ చేసిన వినూత్న ప్రపోజ్ తో సంతృప్తి చెందిన ప్రియురాలు శియోభన్ ఓకే చెప్పేసింది.

దీంతో ఎన్ క్లోజర్ లోనే బిల్, శియోభన్ లు కౌగిలించుకొని లిప్ లాక్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వినూత్న ప్రపోజ్ ను చూసిన జనం చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలిపారు. ఈ మొసలి సాక్షిగా ఒక్కటవుతున్న ఈ జంట వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. కామెంట్స్ మీద కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Best proposal ever