పెదాలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

Best remedy for Back Lips

01:31 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Best remedy for Back Lips

ఎదుటివారిని ఆకర్షించాలంటే మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. కాని కొందరు అలా నవ్వడానికి కూడా మొహమాటపడతారు. దానిక్కారణం వారి పెదాలు నల్లగా ఉండడం, పెదాల చుట్టూ నల్లగా ఉండడం. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు నలుగురిలో నవ్వడానికి వెనకాడతారు. శరీరంలో విటమిన్ల లోపం ఉంటే పెదాలు ఇలా నల్లగా మారుతాయి. మరో కారణం తరచూ నాలుకతో తడుపుతూ ఉండటం కూడానని అంటారు. ఇక సిగరెట్ తాగేవాళ్ళ పెదాలు నల్లబారిపోతాయి. అయితే ఇలా నల్లగా ఉన్న పెదాలను, సహజ రంగులోకి మార్చుకోడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం పదండి..

1/6 Pages

నీళ్లూ, కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు శరీరంలో తేమ పుష్కలంగా ఉండి పెదాలు పొడిబారకుండా అలాగే నల్లగా మారకుండా ఉంటాయి. ఇవి తినడంతో సరిపెట్టకుండా, లిప్ బామ్ ను రెండు పూటలా రాసుకోవాలి. ఎస్.పీ.ఎఫ్ లేని లిప్ బామ్ అయితే మంచిది.

English summary

Best remedy for Back Lips. Follow these steps to avoid black lips.