దోమ కాటుకి సమర్ధవంతమైన చిట్కాలు

Best tips for Mosquito Bites

06:45 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Best tips for Mosquito Bites

దోమలు మానవ మరియు జంతు రక్తాన్ని పీల్చి మనుగడ సాగిస్తాయి. దోమలకు రక్తాన్ని పిల్చుకోవటానికి  సన్నని పదునైన మరియు పొడవైన నోటి బాగం ఉంటుంది. దోమ కుట్టినప్పుడు కన్నా ఆ తర్వాత భాద మరియు నొప్పి ఎక్కువగా ఉంటాయి. దోమ కాటు వలన  వాపు, చర్మం దద్దుర్లు, చర్మం ఇన్ఫెక్షన్, కమిలిన గాయాలు మరియు దురద వంటి లక్షణాలు ఉంటాయి.  ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అందువలన ఇప్పుడు దోమ కాటు లక్షణాలకు ఉపశమనం కలిగించే కొన్ని ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

నిమ్మకాయ

నిమ్మకాయలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనస్థిటిక్ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు చికిత్సలో బాగా సహాయపడుతుంది. నిమ్మకాయను రెండు బాగాలుగా చేసి ఒక నిమ్మ చెక్కతో ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. దోమ కాటు వలన ఇన్ ఫెక్షన్ రాకుండా నిమ్మరసం సహాయపడుతుంది. మరొక ఎంపికగా తులసి రసంలో నిమ్మరసం కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.

English summary

Here are some tips for mosquito bites. Some of the symptoms of mosquito bites are itchiness, swelling, skin rashes, bruising and occasionally skin infection. Mosquito bites can also lead to fatal diseases like malaria and dengue in some parts of the world.