మొబైల్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో మీకోసం...

Best tips that how to do mobile banking

02:31 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Best tips that how to do mobile banking

ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లు రద్దు చేయడంతో కొత్తవి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు! దీంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. అయితే అదే టెక్నాలజీని జేబులో పెట్టుకున్న వాళ్లకు, ఆ ఆలోచన ఉన్నవాళ్లకు ఇది చాలా చిన్న విషయం. చేతిలో మొబైల్ ఫోను, అందులో అవసరమైన యాప్స్ ఉంటే నోటుతో చేసే చాలా పనులను మొబైల్ లోని మీటతో చేయొచ్చు. కాగితం నోటు స్థానాన్ని ఈ యాప్స్, సేవలతో పూర్తిస్థాయిలో భర్తీ చేయలేం కానీ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయొచ్చు. ఇప్పటికే నగదు రహిత లావాదేవీలకు విస్తృతంగా అవగాహన కల్పించే చర్యలు మొదలయ్యాయి.

అలా నగదు రహితంగా ఉండేలా చేసే కొన్ని ఆప్షన్ల గురించి చూద్దాం... రిటైల్ మార్కెట్ లు, షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు బిల్లు చెల్లించాలంటే ఇప్పుడు నోట్లే అవసరం లేదు. మీ వ్యాలెట్ లో డబ్బులు ఉంటే చాలు. వ్యాలెట్ అంటే జేబులోని పర్సు లాంటిదే. అయితే ఇవి సాంకేతిక పర్సులు. మనం పర్సులో డబ్బులు ఎలా పెట్టుకుంటామో, అలా ఈ వ్యాలెట్ లో డబ్బులు వేసుకోవచ్చు... ఖర్చు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో ఈ వ్యాలెట్ లో డబ్బులు వేసుకోవచ్చు.

1/8 Pages

పేటీఎం యాప్ తో...


మొబైల్ లో పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో మొబైల్ నెంబరు తదితర వివరాలతో ఖాతా తెరుచుకోండి. ఆ తర్వాత పైన కనిపించేయాడ్ మనీ ఆప్షన్ లోకి వెళ్లి డబ్బులు లోడ్ చేసుకోండి. సరుకుల కోసం రిటైల్ స్టోర్ కు వెళ్లినప్పుడు, డబ్బులు చెల్లించాల్సిన విధానం దగ్గరపేటీఎం ఆప్షన్ ను ఎంచుకోండి. అక్కడ మీ మొబైల్ నెంబరు ఇస్తే మీకొక ఓటీపీ వస్తుంది. దాన్ని డబ్బులు చెల్లించాల్సిన కౌంటర్ లో చెబితే... మీ పేటీఎం ఖాతా నుంచి అమౌంట్ కట్ అవుతుంది, డబ్బులు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. సినిమా, బస్, రైలు, విమానం తదితర టికెట్స్ కి కూడా ఇదే విధానం అనుసరించాలి.

English summary

Best tips that how to do mobile banking