కష్టపడకుండా బరువుని తగ్గించే అద్భుత చిట్కాలు!

Best tips to burn more calories

06:15 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Best tips to burn more calories

బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం, చెమటలు పట్టేలా జిమ్ చేయడం ఇవే అని చాలా మంది అనుకుని వాటి జోలికి వెళ్ళరు. కానీ డెస్క్ జామ్ చేసే వారు, ఎక్కువ సమయంలో కంప్యూటర్ల ముందు అతుక్కొని పనిచేసేవారు కూడా సీట్లో కూర్చొనే వారు కూడా కొద్దిపాటి ఎఫర్ట్ పెట్టడం వల్ల త్వరగా క్యాలరీలను కరిగించుకోవచ్చు. ముఖ్యంగా 8,9,10 గంటలు జాబ్ చేసే వారు, కూర్చున్న చోటే చిన్న పాటి వ్యాయామాలు చేయవచ్చు. పక్కవారు ఏమైనా అనుకుంటారన్న అనుమానం గానీ భయం కానీ లేకుండా వ్యాయామం చేసేయొచ్చు. ముఖ్యంగా కూర్చొనే క్యాలరీలను బర్న్ చేసుకోవడానికి 10 సులభ మార్గాలున్నాయి.

అయితే, కేవలం ఈ టెక్నిక్స్ వల్లే పూర్తిగా ఫిట్ గా తయారవుతారని అనుకుంటే పొరపాటే. కొంతలో కొంత మెరుగు అని చెప్పవచ్చు. అంతేకాదు, మ్యాక్జిమమ్ రిజల్ట్ కూడా పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

1/11 Pages

1. చూయింగ్ గమ్ నమలడం...


చూయింగ్ గమ్ నమలడం వల్ల 11 క్యాలరీలు కరుగుతాయి. కాబట్టి, షుగర్ లెస్ చూయింగ్ గమ్ ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా క్యాలరీలను కరిగించుకొనే క్రమంలో షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. డెస్క్ జాబర్స్ పని మొదలు పెడితేనే, నోట్లో చూయింగ్ గమ్ నమలడం మొదలు పెట్టాలి. చూయింగ్ గమ్ నమలడం వల్ల బ్రీతింగ్ ఫ్రెష్ గా ఉండటం మాత్రమే కాదు, ఇతర స్నాక్స్ మీద మనస్సు పడకుండా ఉంటుందని చెబుతారు.

English summary

Best tips to burn more calories