హాలీవుడ్ లో అదరగొడుతున్న హ్యాండ్సమ్ హీరో(వీడియో)

BFG theatrical trailer

06:36 PM ON 4th July, 2016 By Mirchi Vilas

BFG theatrical trailer

తెలుగులో తెలుగు చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడుతున్న రోజుల్లో తెలుగు వారికి హాలీవుడ్ చిత్రాలను పరిచయం చేసిన జురాసిక్ పార్క్, జాస్ వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్. స్పీల్ బర్గ్ తీసే సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో స్టీవెన్ మొదటివాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా దూసుకుపోయి.. ఇప్పుడు ప్రతినాయకుడు, తండ్రి పాత్రలతో రెండో ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్న నటుడు జగపతి బాబు స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ఓ తాజా చిత్రంలో భాగమయ్యారు.

అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటంటే జగపతి బాబు ఈ చిత్రంలో భాగమైంది నటుడిగా కాదు.. సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తన గొంతునిచ్చి భాగమయ్యారు. స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన తాజా ఫాంటసీ చిత్రం 'ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)'. డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 15న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు జగపతిబాబు తెలుగు వర్షెన్ కు డబ్బింగ్ చెప్పారు. ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు జగపతి బాబు.

ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో జగపతి బాబు డబ్బింగ్ అద్భుతం అంటున్నారు ట్రైలర్ చూసిన జనం. మరి జగపతి బాబు డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ సినిమా ట్రైలర్ మీరూ కూడా ఒకసారి చూసేయండి..

English summary

BFG theatrical trailer