ఆ సాంగ్స్  ‘భద్రం బికేర్‌ఫుల్‌ బ్రదరూ’

Bhadram Be careful brother Audio launch

10:17 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Bhadram Be careful brother Audio launch

చరణ్‌, రాజ్‌, హమీద ప్రధానపాత్రల్లో నటించిన ‘భద్రం బికేర్‌ఫుల్‌ బ్రదరూ’ చిత్రం లో సంపూర్ణేష్‌బాబు ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. మూడు కోణాల్లో సాగే విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు. రాజేష్‌ పులి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోణం కృష్ణసతీష్‌, అడ్డగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ నిర్మిస్తున్నారు. జె.బి. సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ విడుదల చేయగా,మారుతి స్వీకరించాడు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో సుమంత్‌ అశ్విన్‌, కల్యాణ్‌కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణ, శ్రీవసంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ మాట్లాడుతూ ‘‘మారుతి పరిచయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆదరణ లభించింది. నా ‘హృదయకాలేయం’ చూసి నన్ను అభినందించిన మొట్టమొదటి వ్యక్తి మారుతి. ఈ సినిమాలో నాతో వైవిధ్యమైన సంభాషణలు చెప్పించారు. వాటిని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు’’ అని అన్నాడు.

English summary

Bhadram Be Careful Brother movie Audio launched by young hero Raj Tarun.In this movie Sampoornesh Babu was also acted in the lead role.