రవితేజతో 'భలే' ఛాన్స్‌ కొట్టేశాడు!

Bhale Manchi Roju director got chance with Raviteja

11:37 AM ON 30th December, 2015 By Mirchi Vilas

Bhale Manchi Roju director got chance with Raviteja

శ్రీరామ్‌ ఆదిత్య, నిన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఓవర్‌నైట్‌ హిట్ డైరెక్టర్‌గా వెలుగులోకి వచ్చాడు. శ్రీరామ్‌ ఆదిత్య, సుథీర్‌ బాబుతో తెరకెక్కించిన తాజా చిత్రం 'భలే మంచి రోజు'. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నుండే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. సుథీర్‌బాబుకి కూడా మంచి లైఫ్‌ ఇచ్చింది. మామూలుగా టాలెంట్‌ ఎక్కడ ఉంటే మన టాలీవుడ్‌ నిర్మాతలు వాళ్ల కోసం పరుగులు తీస్తారు. అందులోకి మొదటి సినిమాతోనే హిట్‌ కొడితే ఇంక వాళ్ల వెనకాల స్టార్‌ హీరోలు, నిర్మాతలు క్యూ కడతారు. శ్రీరామ్ది కూడా ఇప్పుడు అదే పరిస్ధితి. భలే మంచి రోజు చిత్రం ఫలితంతో ఇప్పుడు తన రేంజే మారిపోయింది.

ఇప్పుటికే కొంత మంది నిర్మాతలు శ్రీరామ్‌ కి అడ్వాస్స్‌ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రవితేజ, శ్రీరామ్‌ విషయంలో కూడా ముందడుగు వేశాడు. శ్రీరామ్‌ రవితేజ కి ఒక కథ వినిపించగా, ఆ కథ నచ్చడంతో రవితేజ ఆ స్క్రిప్ట్‌ని పూర్తిగా డెవలప్‌ చెయ్యమని కోరాడట. నిర్మాతను కూడా తనే సెట్‌ చేస్తానని రవితేజ శ్రీరామ్‌ కి హామీ కూడా ఇచ్చాడట. ప్రస్తుతం 'భలే మంచి రోజు' విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఒక నెెల రోజులు అయ్యాక ఈ స్క్రిప్ట్ పై పూర్తి వర్క్‌ చేసి రవితేజ గారి వద్దకు వెళ్తానని శ్రీరామ్‌ చెప్తున్నాడు.

English summary

Bhale Manchi Roju director Sriram Adithya got chance with Raviteja to direct his next film.