పెళ్లికూతురితో లేచిపోయిన డైరెక్టర్

Bhale Manchi Roju director Sriram Aditya jumps with girlfriend

11:52 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Bhale Manchi Roju director Sriram Aditya jumps with girlfriend

కాలేజీ చదువుకునే అబ్బాయిలే కాదు ఓ డైరెక్టర్ కూడా గర్ల్ ఫ్రెండ్ తో చెక్కేసిన వైనం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం గా మారింది. 'భలే మంచి రోజు' మూవీలో కళ్యాణ మంటపం నుంచి పెళ్లి కూతురు తనకు నచ్చిన యువకుడితో లేచి పోయే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ నే తన రియల్ లైఫ్ లో ఈ డైరెక్టర్ నిజం చేశాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన గర్ల్ ఫ్రెండ్ తో పరారయ్యాడట.. ఆ అమ్మాయి పెళ్లి మరి కొద్ది రోజుల్లో జరగనుండగా ఆమెను తీసుకుని ఆదిత్య ఎలాప్ అయ్యాడని టాక్ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. 'భలే మంచి రోజు' మూవీ తీసిన శ్రీరామ్ ఆదిత్య కీ ఈ అమ్మాయికీ మధ్య కొన్ని రోజులుగా పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది.

అయితే ఆ యువతి పేరెంట్స్ మరొకరితో ఈ నెల 17న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని, వెడ్డింగ్ కార్డులు కూడా పంచేశారని తెలిసింది. కానీ మంగళవారం ఆ యువతి ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆదిత్యతో ఉడాయిన్చిందట. దీంతో షాక్ తిన్న ఆ అమ్మాయి పేరెంట్స్ పోలీసులకు మాత్రం కంప్లయింట్ ఇవ్వలేదు.

English summary

Bhale Manchi Roju director Sriram Aditya jumps with girlfriend. Bhale Manchi Roju director Sriram Aditya jumps with bride.