క్రిస్మస్ కి 'భలేమంచి రోజు'

Bhale Manchi Roju releasing in Christmas

01:50 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Bhale Manchi Roju releasing in Christmas

'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' అట్టర్‌ ఫ్లాప్‌ తరువాత సుధీర్‌బాబు నటించిన తదుపరి చిత్రం 'భలేమంచి రోజు'. ఈ చిత్రంలో సుధీర్‌ సరసన వామికా గబ్బీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై హిట్‌ సాంగ్స్‌ ముద్రను సంపాదించుకుంది. యాక్షన్‌, రొమాంటిక్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. సుధీర్‌ నటించిన ప్రేమకథా చిత్రమ్‌ 2013 లో విడుదలైంది.

ఈ సినిమా హిట్‌ తరువాత సుధీర్‌ నటించిన తదుపరి చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో సుధీర్‌ ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం హిట్‌ కావాలని మనం కూడా ఆశిద్దాం.

English summary

Bhale Manchi Roju releasing in Christmas. In this movie Sudheer Babu and Wamiqa Gabbi playing in lead roles.