ఈ కలయిక వెనుక పవన్ వున్నాడా ?

Bharadwaj Meets Narendra Modi

09:53 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Bharadwaj Meets Narendra Modi

మెగాస్టార్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఢిల్లీలో ప్రధాని మోడీని, ఆయన ఇంట్లో కలవడం సహజంగానే హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శిరీష్ భరద్వాజ్ బీజేపిలో చేరిన సమయంలోనే మోడీని కలుసుకోడానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో మోడీ ప్రధాని కాదు కనుక కలవడం పెద్ద కష్టం కాదు. మరి ఇప్పుడు కష్టమేగా...

ఎందుకంటే ఇప్పుడు ప్రధాని మోడీ చాలా బిజీగా ఉన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అటువంటి తరుణంలో శిరీష్ భరద్వాజ్ ఎలా అపాయింట్మెంట్ సంపాదించాడు. అందుకే చర్చకు దారితీసింది. పైగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నరనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్న సమయంలో మోడీతో శిరీష్ భరద్వాజ్ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.

వాస్తవానికి శిరీష్ భరద్వాజ్ కు ఢిల్లీలో నాయకుల వద్ద కాస్తో కూస్తో పలుకుబడి వుందని అంటున్నారు. కాని, ప్రధానితో కలిపించెంతటి పలుకుబడి ఉందా అంటే లేదని చెప్పాలి. మరి ఎలా కలిశాడబ్బా అంటూ బడానేతలు నోరెళ్ళబెడుతున్నారు. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ ఇప్పించాడా అనే అనుమానాలు వస్తున్నాయి. నెట్ లో ఈమేరకు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇటు చంద్రబాబుకు, అటు మోడీకి కూడా పవన్ కళ్యాణ్ అంటే రెస్పెక్ట్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, మెగాస్టార్ కూతురికి మళ్ళీ పెళ్లి అనే వార్తల నేపధ్యంలో అన్న కు కోపం వచ్చే పని తమ్ముడు పవన్ చేస్తాడా? అంతలా చేయాల్సిన అవసరం పవర్ స్టార్ కి ఏముంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఉందనే అనుమానాలూ వస్తున్నాయి. ఏది ఏమైనా, ఇంతకీ ఎవరు అపాయింట్ మెంట్ ఇప్పించి వుంటారబ్బా ...

English summary