బసవేశ్వరుడి విగ్రహ ఆవిష్కరణ వెనుక తెలుగువాడు

Bhasveswara statue unveiled in London by PM

03:01 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Bhasveswara statue unveiled in London by PM

బ్రిటన్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే దీని వెనక తెలుగువాడి పాత్ర వుంది. రంగారెడ్డి జిల్లా, తాండూరు వాస్తవ్యుడు కీలక పాత్ర పోషించారు. వివరాల్లోకి ల్యాంబెత నగర మాజీ మేయర్‌ అయిన డాక్టర్‌ నీరజ్‌ పాటిల్‌ బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా.. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ గత మార్చిలో స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఆహ్వానించడం , ఇందుకు అంగీకరించిన మోదీ.. అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగాయట. అందుకే బ్రిటన్ పర్యటనకు వచ్చ్హి , విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటుతో బసవేశ్వరుడి తత్వాలను విదేశాల్లో కూడా చాటినందుకు నీరజ్‌ పాటిల్‌ను ప్రధాని మోదీ అభినందించారు. నీరజ్‌ పాటిల్‌ తాండూరులో పుట్టి పెరిగారు. ఆయన తల్లి డాక్టర్‌ కె.పార్వతీ దేవి పాటిల్‌ తాండూరులో మొదటి మహిళా వైద్యురాలు. విద్యాభ్యాసం తర్వాత లండన్‌కు వెళ్లి స్థిరపడిన నీరజ్‌ పాటిల్‌ ల్యాంబెత నగరానికి మేయర్‌గా పనిచేశారు. మేయర్‌గా ఉన్నప్పుడే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటాలని భావించి, థేమ్స్‌ నది తీరాన బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. విగ్రహాన్ని స్థాపించి మోదీచేత ఆవిష్కరింపచేశారు. దీంతో తాండూరు వాసులు, స్థానిక వీరశైవులు కూడా పాటిల్‌ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

English summary

Basveswara statue unveiled in London by PM.Prime Minister Narendra Modi on Saturday during a vistit to Britain basaveswara statue unveiled in London