భీమ్ మొబైల్ యాప్.. పనిచేసేది ఇలాగట

BHIM Mobile App Launched By Indian Government

10:39 AM ON 31st December, 2016 By Mirchi Vilas

BHIM Mobile App Launched By Indian Government

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవిష్కరించిన మొబైల్ పేమెంట్ యాప్ భీమ్ వినియోగించడం చాలా సులువు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ భీమ్ యాప్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వెర్షన్ తర్వలో అందుబాటులోకి రానుంది.

భీమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో బ్యాంకు ఖాతా వివరాలను రిజిస్టర్ చేసి యూపిఐ పిన్ సెట్ చేసుకోవాలి. దీంతో మీ మొబైల్ నెంబర్ మీ పేమెంట్ అడ్రస్ అవుతుంది. ఇక ఎంచక్కా డిజిటల్ లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆధార్ ఆధారితమైన భీమ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో చేతి వేలి గుర్తుతో డిజిటల్ పేమెంట్స్ జరపవచ్చు.

నెట్ బ్యాంకింగ్ మాదిరిగా ఐఎఫ్ఎస్ సీ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి ఇతరులకు డబ్బులు పంపవచ్చు లేదా ఇతర అకౌంట్ల నుంచి మన ఖాతాలోకి నగదు పొందవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు ఫోన్ నెంబర్ షేర్ చేయకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు.

ఫీచర్ ఫోన్ల ద్వారా భీమ్ యాప్ తో యూఎస్ఎస్ డి విధానంలో లావాదేవీలు జరపవచ్చు. దీని కోసం మొదట *99# కు డయిల్ చేయాలి. దీనికి ఎలాంటి ఇంటర్ నెట్ కనెక్షన్ అవసరం లేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఖాతాలకు ఇది అనుసంధానంగా ఉంటుంది. భీమ్ యాప్ ద్వారా ఒకసారికి గరిష్టంగా రూ.10,000, ఒక రోజులో రూ.20,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అన్నట్టు డాక్టర్ బాబా సాహెబ్ భీం రావు అంబేద్కర్ పేరిట భీం యాప్ రూపొందించారు.

ఇవి కూడా చదవండి: మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కల్గించే వస్తువులు ఇవే ... వెంటనే తీసేయండి..!

ఇవి కూడా చదవండి: గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

English summary

A News Mobile Application was launched by Indian Prime Minister Narendra Modi and named it as "BHIM". By using this app we can do digital transactions and this app was presently available for android smart phone users and IOS app will be release soon.