నారాయణఖేడ్  నుంచి  భూపాల్ రెడ్డి 

Bhoopal reddy selected as TRS candidate form narayankhed

05:40 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Bhoopal reddy selected as TRS candidate form narayankhed

మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎం భూపాల్‌రెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి గడిచిన ఏడాది ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందిన నేపధ్యంలో ఉపఎన్నిక అనివార్యం కావడంతో 2014 ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన భూపాల్‌రెడ్డి పేరునే టిఆర్‌ఎస్ తిరిగి తమ అభ్యర్థిగా ప్రకటించింది.
కాగా, కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ-టీడీపీలు ఉమ్మడి అభ్యర్తిగా ఎం. విజయ్‌పాల్‌రెడ్డిని రంగంలో దించుతుందని భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ సిట్టింగ్ సీటు మళ్ళీ కాంగ్రెస్ కే దక్కుతుందో , టి ఆర్ ఎస్ ఎగరేసుకుపోతుందో, కమలదళం - తెలుగు తమ్ముళ్ళు ఉమ్మడిగా దక్కించుకుంటారో చూడాలి.

English summary

Bhoopal reddy selected as TRS candidate form narayankhed.