మహీ ఫాన్స్ కి  బ్రహ్మోత్సవమే ..

Bhramotsavam Teaser To Launch On Jan 1st

03:37 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Bhramotsavam Teaser To Launch On Jan 1st

ప్రస్తుత 2015లో శ్రేమంతుడు ఘనవిజయంతో మంచి ఊపు మీదున్న టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ 2016లో కూడా మరింత హుషారు గా ఉండబోతున్నారు. అదికూడా నూతన సంవత్సర శుభ వేళె. వివరాల్లోకి వెళితే,.....

మహేశ్‌ బాబు కథానాయకుడుగా బ్రహ్మోత్సవం చిత్రం తెరకెక్కుతున్నవిషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేశ్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీతలు నాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. అయితే సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులకు నూతన సంవత్సర కానుక అందించనున్నట్లు పీవీపీ సినిమా ప్రకటించింది. అదేమంటే , బ్రహ్మోత్సవం చిత్ర టీజర్‌ని అభిమానులకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఒకటిన విడుదల చేయనున్నారు. మరి కొత్త సంవత్సర ఆరంభంలో మహీ అభిమానులకు బ్రహ్మోత్సవమే.

English summary