అయ్యో భూమిక ఇలా అయిపోయిందేంటి?(వీడియో)

Bhumika Chawla in MS Dhoni movie

03:20 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Bhumika Chawla in MS Dhoni movie

తారలు కూడా మనుషులే. వాళ్ళు ఎంత సెలబ్రిటీలైనా ఓ కుటుంబంలో ఉన్నాక అందరిలా ఉండాల్సిందే. అందం కూడా ఎల్లకాలం ఉండదు కూడా. ఇక ఒకప్పుడు తెలుగు తెరపై టాప్ హీరోయిన్ గా వెలుగొందిన భూమికను ఇప్పుడు చూస్తే మనం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. కేవలం తన అందం టాలెంట్ తోనే టాప్ హీరోలందరితోను వరుసగా సినిమాలు చేసేసింది. మిస్సమ్మలాంటి థీమ్ బేస్డ్ మూవీని సింగిల్ హ్యాండ్ తో హిట్ చేసేసి.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి ఉన్న సత్తా ఏంటో ప్రేక్షకులకు తెలియజేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైనపోయిన భూమిక.. ఇపుడు పూర్తిగా మారిపోయి స్క్రీన్ పై కనిపించనుంది. భూమికను చూసిన వారంతా ఇలా అయిపోయిందేంటి అని తెగ బాధపడిపోతున్నారట.

సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఎం.ఎస్. ధోనీ మూవీలో, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అక్క పాత్రలో భూమిక కనిపించనుందట. రియల్ లైఫ్ లో ధోనీ అక్క ఎంత ఇన్ స్పిరేషన్ గా నిలించిందో నిజంగా చెప్పలేం కానీ.. ట్రైలర్ మొత్తం మీద ఈమె ఒక్కసారి కనిపించిందంతే. పైగా మన సినిమాల్లో, అక్కా చెల్లి పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హీరోయిన్ గా టాప్ స్టేజ్ ని అనుభవించిన భూమిక. ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ కాలేదు. హిందీ హీరోయిన్స్ లా పెళ్లయ్యాక కూడా ట్యాలెంట్ చూపించేందుకు సౌత్ హీరోయిన్స్ కు ఛాన్స్ దొరకదు. దొరికినా ఇటువంటి పాత్రలే దొరుకుతాయి. ధోనీ ట్రైలర్ లో తమ అభిమాన హీరోయిన్ ని చాన్నాళ్లకు చూసిన ఫ్యాన్స్ ఇలా అయిపోయావేంటి భూమిక అని తెగ ఫీలైపోతున్నారట.

ఇది కూడా చదవండి: అభినేత్రి ఆడియో లాంచ్ లో మెరిసిన తారలు(ఫోటోలు)

ఇది కూడా చదవండి: చారిత్రాత్మక 500వ టెస్టులో భారత్ ఘన విజయం!

ఇది కూడా చదవండి: రకుల్ మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

English summary

Bhumika Chawla in MS Dhoni movie. Versatile actress Bhumika Chawla in M.S. Dhoni movie trailer. She is acting as a sister for Susanth Singh Rajput in this movie.