మిస్సమ్మకు భర్తతో రోజూ గొడవలే... ఇక విడాకులే!

Bhumika want to take divorce from his husband

12:03 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Bhumika want to take divorce from his husband

‘మిస్సమ్మ’ భూమికకు భర్తతో తలనొప్పులు స్టార్ట్ అయ్యాయట. నిత్యం గొడవలు పడుతున్న ఈమె, భర్త నుంచి విడిపోవాలని కోరుకున్నట్లు టాక్. ఇంతకీ విషయం ఏమిటి? ఉన్నట్లుండి భూమిక నిర్ణయం వెనుక అసలేం జరిగింది? ఇదంతా నిజం అనుకుంటున్నారా? అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు... రీల్ లైఫ్‌లో! చాన్నాళ్లగా టాలీవుడ్‌కి దూరంగాఉన్న నటి భూమిక.. గతేడాది ఇంద్రజిత్ లోకేష్ డైరక్షన్‌లో శాండిల్‌వుడ్‌‌లో వచ్చిన ‘ఐ లవ్ అలియా’ మూవీని అదేపేరుతో బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఈమె రోల్ పేరు భూమి. ఓ డాన్స్ టీచర్ అయిన భూమి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తతో నిత్యం గొడవలు మొదలవుతాయి.

ఈ క్రమంలో భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటుందట. భూమికకు భర్తగా రవిచంద్రన్ కనిపించనున్నాడు. మిగతా క్యారెక్టర్స్‌లో సన్నిలియోన్, చంద్రన్‌కుమార్, సంగీత చౌహాన్, షాయాజి షిండే దర్శనమీయనున్నారు. షూటింగ్ పూర్తికావడంతో వచ్చేనెలలో విడుదలకు సిద్ధమవుతోంది. సమాజానికి మంచి సందేశంతో తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని భూమిక అంటోంది. ఇలాంటి రోల్‌ను తన కెరీర్ లో చేయలేదని సంబర పడుతోంది.

English summary

Bhumika want to take divorce from his husband