840 ఏళ్ల క్రితం ఇక్కడే పుట్టానని., అప్పటి స్మృతులు ప్రస్తావిస్తున్న భూటాన్ యువరాజు.!

Bhutan Prince Reminds His Past Life After Visiting Nagarjunakonda

10:54 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Bhutan Prince Reminds His Past Life After Visiting Nagarjunakonda

గత జన్మల గురించి సినిమాలు కూడా వచ్చాయి అయితే దీన్ని కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరు.. అయితే,ఈ వాదనల విషయం ఎలా వున్నా పూర్వ జన్మకు సంబంధించి తాజాగా మరో విషయం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే, నాగార్జునకొండ ప్రాంతంతో తనకు పూర్వజన్మ సంబంధం ఉన్నట్లు భూటాన్ యువరాజు వెరోచా నారింపో తెలిపాడు. భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ కొడుకైన 3 ఏళ్ల వెరోచా నారింపో గత కొన్ని రోజులుగా….జలాశయాంలో ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గరకు లాంచీలో వెళ్లాలని నత్తినత్తిగా పలుకుతున్నాడని భూటాన్ రాణి తల్లి అసిదోర్జి చెప్పారు.అయితే ఈప్రాంతం గురించి తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డామని, చివరకు ఆచూకీ తెలుసుకొని ఇక్కడి పర్యటనకు వచ్చినట్టు తెలిపారు.

అయితే …నాగార్జున సాగర్ పర్యటనకు వచ్చిన యువరాజు వెరోచా….తాను 840 సంవత్సరాలకు పూర్వమే భారత్ లో పుట్టానని.. నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని చెప్పుకొస్తున్నాడు, అంతేకాదు…తాను తిరిగిన ప్రదేశాలను, కొండపై తాను కూర్చున్న ప్రదేశాలను సైతం తన అమ్మమ్మకు చూపిస్తూ ఆశ్చర్యపరిచాడు. తనకు కలలో ఐదు తలల పాము కనిపిస్తోందని.. అప్పట్లో ఆ పాము నాగార్జున కొండపై తిరిగేదని అంటున్నాడు. ప్రస్తుతం కొండపై ఉన్న విగ్రహం అప్పట్లో నది మధ్యలో ఉండేదని చెబుతున్నాడు.

నాగార్జున కొండ విశేషాలు.

సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల లో భద్రపరిచారు. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం వంటి ఎన్నో చూడతగ్గ వస్తువులు ఇందులో వున్నాయి. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల ఇది.

ఇవి కూడా చదవండి: వామ్మో, దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఇదేనట

ఇవి కూడా చదవండి: ఐష్ డాటర్ - ఆమిర్ సన్ రఫ్ ఆడించారు(వీడియోలు)

English summary

Bhutan Prince was shocked everyone by saying that he reminds his past life after visiting Nagarjunakonda. He said that he have been studied in Nagarjuna University in his past life and he was also able to remember about his visited places.