సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 'బిచ్చగాడు' హీరోయిన్

Bichagadu heroine Satna Titus married secretly

05:56 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Bichagadu heroine Satna Titus married secretly

విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'పిచ్చైక్కారన్' తమిళంలో సూపర్ హిట్ అయ్యి అనువాద చిత్రంగా తెలుగులో 'బిచ్చగాడు'గా వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నెలకొల్పిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ సినిమా ద్వారా కథానాయకిగా పరిచయం అయిన భామ సాట్నాటైటస్. 'నేనో తింగరబుచ్చీ' అంటూ పాట పాడి బిచ్చగాడిని ప్రేమించిన సాట్నా టైటస్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తన కూతురుని మోసం చేశారని మాయమాటలు చెప్పి నమ్మించారని ఆమె తల్లి నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఈ సినిమా అనంతరం ఫుల్ ఆఫర్స్ సంపాదించుకునే పనిలో ఉంటుందిలే అనుకున్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది సాట్నాటైటస్.

ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తిని సాట్నా రహస్య వివాహం చేసుకుందట. ఈ మేరకు నెల రోజుల క్రితమే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ఈ పెళ్లి సాట్నా తల్లికి ఏమాత్రం ఇష్టం లేదట. తన కూతురిని అతడు మాయలో పడేశాడని.. కార్తి నుంచి సాట్నాను విడిపించాలని నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న బయ్యర్ కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని త్వరలో బహిరంగంగా మళ్లీ పెళ్లి చేసుకుంటామని చెప్పారు. పెళ్లి తర్వాత సాట్నా తన నటనకు స్వస్తి చెప్పనున్నారని చెప్పారు. దీంతో సాట్నా ఇప్పటికే అంగీకరించిన తిట్టం పోట్టు తిరుడర కూట్టం సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.

ఇది కూడా చదవండి: పవన్ కోసం దాసరి రిజిస్టర్ చేయించిన టైటిల్ ఇదే!

ఇది కూడా చదవండి: పాము కాటేస్తే చనిపోతాం.. అదే పాము విషం తాగితే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ అమ్మాయిలు ఉండే సిటీస్ ఇవే!

English summary

Bichagadu heroine Satna Titus married secretly. Bichagadu heroine Satna Titus love marriage was done secretly.