దిమ్మ తిరిగేలా చేసిన 'బిచ్చగాడు'

Bichagadu movie creates record with 25 crore gross collections

11:52 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Bichagadu movie creates record with 25 crore gross collections

ఘోరంగా చూస్తే హీనంగా దెబ్బతింటారని ఓ సినిమాలో వున్న డైలాగ్ కి అనుగుణంగా 'బిచ్చగాడు' మూవీ దూసుకెళ్లింది. అసలు బిచ్చగాడనే సినిమా విడుదలైనపుడు ఎవ్వరికీ పట్టలేదు. వారం తర్వాత కానీ జనాలకు ఈ సినిమా గురించి తెలియలేదు. ఇదేదో మంచి సినిమాలా వుందే అని ఆనోటా ఈనోటా జనాలు మాట్లాడుకోవడంతో నెమ్మదిగా కలెక్షన్లు పెరిగాయి. మౌత్ పబ్లిసిటీ మహిమో ఏమో గానీ రెండో వారం కలెక్షన్లు పుంజుకోవడం చూసి.. ఈ సినిమా కోటి రూపాయలకు పైగా వసూలు చేసేలా ఉందంటూ గొప్పగా చెప్పుకున్నారు. రెండో వారం పూర్తయ్యేసరికి ఆ మార్కు దాటేసింది.

ఆ తర్వాత ఐదు కోట్ల టార్గెట్ అన్నారు. అదీ దాటేసింది. ఆపై రూ.10 కోట్లు.. తర్వాత రూ.15 కోట్లు.. రూ.20 కోట్లు.. ఇలా చూస్తుండగానే ఒక్కో మైలురాయినీ దాటుకుంటూ వెళ్లిపోయిందీ సినిమా. రూ.20 కోట్ల మార్కును టచ్ చేసినపుడే వామ్మో అనుకున్నారు. అదే చాలా చాలా గొప్ప అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా రూ. 25 కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ చేసేసి, మరో రికార్డు కొట్టేసింది. దీన్ని జస్ట్ బ్లాక్ బస్టర్ అన్నా సరిపోదు. అంతకన్నా ఎక్కువే అనాలి. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి.. సాధించిన వసూళ్లు చూస్తుంటే దిమ్మతిరిగిపోతోంది. అనువాదాల చరిత్రలోనే కాదు.. బహుశా టాలీవుడ్ లోనే ఇది పెట్టుబడి మీద అత్యధిక రెట్లు వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని అంటున్నారు.

63వ రోజుకు రూ. 25 కోట్ల మైలురాయిని అందుకుంది బిచ్చగాడు. ఆంధ్రాలో రూ.10.87 కోట్లు.. నైజాంలో రూ.7.35 కోట్లు.. సీడెడ్ లో రూ.6.85 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఇప్పటికీ 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో 'బిచ్చగాడు' థియేటర్లు నడుస్తున్నాయి. వంద రోజుల వరకు బిచ్చగాడు హవా తగ్గేలా లేదు. రూ.30 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary

Bichagadu movie creates record with 25 crore gross collections