అంతుచిక్కని 'బిచ్చగాడు' ట్రెండ్

Bichagadu movie creating trend

12:50 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Bichagadu movie creating trend

హీనంగా చూస్తే, ఘోరంగా దెబ్బతింటావ్ అనే డైలాగ్ కి సరిగ్గా 'బిచ్చగాడు' విషయంలో నిజమైంది. చిన్న సినిమాలంటే వుండే చిన్నచూపు కారణంగా బిచ్చగాడు సినిమా రిలీజైనప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇది అనువాద సినిమా కావడం వలన అస్సలు ఆవైపే చూడలేదు. అంతేకాదు, ఈ మూవీలోని యాక్టర్లు కూడా తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోవడంతో మొదట్లో బిచ్చగాడిని లైట్ తీసుకున్నారు. కానీ, రోజులు గడిచేకొద్దీ 'బిచ్చగాడి' విలువ తెలియడం మొదలుపెట్టింది. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ఇప్పటి దాకా 25కోట్లకు పైగా వసూలు చేసింది.

అనువాద సినిమాలు ఇంత మొత్తం వసూలు చేయడం దక్షిణాదిన మొదటిసారి అంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడం బిచ్చగాడికి కలిసొచ్చిన అదృష్టం. ఈ సినిమా పూర్తి స్థాయిలో 30 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి ఈ బిచ్చగాడు టాలీవుడ్ లో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. శత దినోత్సవానికి పరుగులు తీస్తున్న బిచ్చగాడి మాయాజాలం ఓ పట్టాన అంతుబట్టడం లేదు. నిజంగా బాలీవుడ్ లో ఈ మూవీ ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

English summary

Bichagadu movie creating trend