కొన్నది 50లక్షలు ... వచ్చింది 12 కోట్లు .. ఇది బిచ్చగాడు సంపాదన

Bichhagadu movie collection 12 crores

12:27 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Bichhagadu movie collection 12 crores

అవునా, చిన్న సినిమా అంటే వుండే వివక్షతను పారదోలి దిమ్మతిరిగేలా చేసింది ఈ సినిమా. పైగా డబ్బింగ్ సినిమా .. పేరు చూస్తే నొసటితో వెక్కిరిస్తాం ... కానీ కలెక్షన్స్ ఆదరగోట్టిసింది. ఇంతకీ ఈ సినిమా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్దాం. కేవలం 50 లక్షలు పెట్టి తెలుగు రైట్స్ కొనుకున్న బిచ్చగాడు డబ్బింగ్ని మూవీ నిర్మాతకి లాభాల పంట పండించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటికి ఈ సినిమా తెలుగు నాట 12 కోట్ల రుపాయులు కలక్ట్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఇలాంటి చిత్రాలు కేవలం తమిళ వారు మాత్రమే తెరకెక్కించగలరా? తక్కువ బడ్జట్ తో ఎక్కువ లాభాలను పొందటం తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి తెలియదా అంటే అవుననే సమాధానం వస్తుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా రిలేజ్ అయి ఇంత రికార్డ్ వసూళ్ళు కురిపించిన తెలుగు చిత్రం ఏదైనా ఉందా అంటే గత పదేళ్ళలో ఒక్క హ్యాపీ డేస్ లాంటి చిత్రం తప్ప మరొకటి వుండదు. అయితే ఇదే గత పదేళ్ళలో చాలా తమిళ చిన్న చిత్రాలు నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి. నిజానికి టెక్నికల్ గా తెలుగు సినిమా స్థాయి చాలా హై రేంజ్ లోనే ఉంది. దర్శక , నిర్మాతల ఆలోచనా విధానంలోనే మార్పు అవసరమని బిచ్చగాడు చాటిచెప్పాడు. కాన్సెప్ బేస్డ్ మూవీస్ గురించి ఆలోచించకుండా అంతా కమర్షియల్ సినిమాల వైపే చూస్తుండడం వలన అందరూ ఒకే మూసలో నడుస్తున్నారు.

మాస్ స్టెప్పులతో, వల్గర్ డైలాగ్స్ తో, ఐటెం పాటలతో.. తెలుగు సినిమా ప్రేక్షకుల కళ్ళు , చెవులు , మనసు , మైండ్ అన్ని దియేటర్స్ లో తుపు పట్టి పోతున్నాయి. అందుకే అప్పుడప్పుడు వచ్చే బిచ్చగాడి లాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి ప్రేక్షకులు తిరనాళ్ళకి వెళ్లినట్టు వెళ్తున్నారు. కనీసం బిచ్చగాడు నేర్పిన పాటంతో అయినా మన దర్శక, నిర్మాతలు మేలుకుంటారో లేదో చూడాలి అంటూ నెటిజన్లు వాయించేస్తున్నారు.

ఇది కూడా చూడండి:వర్మకు ముద్దొచ్చిన ట్రంప్

ఇది కూడా చూడండి:నయనతార మళ్లీ లవ్ లో ఫెయిల్ అయిందా?

ఇది కూడా చూడండి:కెసిఆర్ - జగన్ మగాళ్ళు అంటున్న చోటా (వీడియో)

English summary

Bichhagadu movie collection 12 crores.