‘కబాలి’ హిందీలో రీమేక్ - హీరోగా బిగ్ బి!

Big B To Play Rajinikanth Role In Kabali Remake

10:46 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Big B To Play Rajinikanth Role In Kabali Remake

ఓ పక్క సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ మిశ్రమ స్పందన సొంతంచేసుకోగా, ఇప్పుడు మరో వార్త వచ్చింది. అదే హిందీలో రీమేక్ చేస్తారట. అవునండీ,గతంలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు. అమితాబ్ హిందీలో నటించిన కొన్ని చిత్రాల తమిళ రీమేక్లో రజినీకాంత్ నటించారు. మరి ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘కబాలి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారట. ఇందులో బిగ్బి అమితాబ్ బచ్చన్ రజినీ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ‘బచ్చన్ కబాలి రీమేక్లో నటించనున్నారు. రజినీ తమిళ చిత్రాలు హిందీలో అంతగా ఆడవు. ఎందుకంటే.. తమిళనాడు కల్చర్ ప్రత్యేకంగా ఉంటుంది. మలేషియాలో తమిళ ప్రజలజీవితంపై కబాలి చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ఫ్లేవర్, డైలాగ్స్, సంస్కృతి తమిళనాడుని ప్రతిబింబించేలా ఉంటాయి’ అని ఫిలిం వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు చెప్పినట్లు తెలుస్తోంది. చూద్దాం ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుందో.

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చూడండి: నెలరోజుల్లో బరువు పెరగడం ఎలా?

ఇది కూడా చూడండి: ఆ నాలుగు చోట్ల సెల్‌ఫోన్‌ పెట్టుకోకూడదట

English summary

Big B To Play Rajinikanth Role In Kabali Hindi Remake.