శాతకర్ణి కోసం భారీ యుద్ధనౌక

Big Battleship in Goutamiputra Satakarni movie

01:07 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Big Battleship in Goutamiputra Satakarni movie

నందమూరి నటసింహం బాలయ్య టైటిల్ రోల్ చేస్తోన్న గౌతమీపుత్ర శాతకర్ణి ర్యాపిడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. మే 30 నుండి హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో రెండో షెడ్యూల్ జరుపుకోనుంది.

భారీ యుద్ధనౌక సెట్ వేసి ఆ సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం 200 మంది ఆర్టిస్టులకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అధ్వర్యంలో యుద్ధానికి సంబంధించి కత్తిసామును ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మొత్తానికి ఈచిత్రానికి మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

English summary

Big Battleship in Goutamiputra Satakarni movie