మమతా వర్సెస్ బోస్‌ మనవడు-బిగ్ ఫైట్ 

Big fight between Mamatha Benarjee and Chandra Kumar Bose

10:17 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Big fight between Mamatha Benarjee and Chandra Kumar Bose

ఎన్నికలంటేనే మజా... ఎత్తులు, పైఎత్తులు సహజం... రసవత్తర పోరు ఉండనే వుంటుంది. మరి పశ్చిమబంగా ఎన్నికలంటే మరీను... పశ్చిమ బంగాలో దీదీ గా పేరొందిన బంగా బెబ్బులి, సిఎమ్ మమతాబెనర్జీపై సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ పోటీ చేయబోతున్నారు. బిజెపి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారు. అసలే ఈ మధ్య సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీ పై చర్చ సాగుతుండగా, కొన్ని ఫైల్స్ కూడా విడుదల అయ్యాయి. మరికొన్ని ఫైల్స్ అందుబాటులో లేవు. ఈ నేపధ్యంలో జరిగే పశ్చిమ బంగా ఎన్నికల్లో బోస్ మనవడు తలపడడం రసవత్తరం కానుంది. ఈ ఇద్దరి మధ్య ఎన్నికల పోరు మొత్తం ఎన్నికలకే హైలెట్ గా నిలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. బెంగాలీలు ఎవరివైపు మొగ్గుతారో చూడాలి.

English summary

Big fight between Mamatha Benarjee and Chandra Kumar Bose in Banga elections.