త్వరలో చౌక ధరలకే లార్జ్ స్క్రీన్ ఫోన్లు..

Big screens and cheaper smartphones to release in 2016

04:05 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Big screens and cheaper smartphones to release in 2016

స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువు. అందువల్ల ఈ రంగం ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. నెట్‌వర్క్ విస్తరణ పెరగడం.. వినియోగదారుల సంఖ్య ఎక్కువవుతుండడం.. కొత్త మొబైల్స్ కొనేవారు పెరగడం.. తదితర కారణాలతో స్మార్ట్ ఫోన్ రంగం వేగంగా ముందుకు వెళుతోంది. దీంతో ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు సాధారణ ప్రజల చేతుల్లోనూ సందడి చేస్తున్నాయి. హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లను మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు తమ డివైస్‌లలో అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇకపై ఈ స్మార్ట్‌ఫోన్లు ఇంకా పెద్ద స్క్రీన్లతో ఇప్పుడున్న వాటి కన్నా తక్కువ ధరలకే లభించనున్నాయి. ఈ తరహా ఫోన్లు 2016లో వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటాయని ప్రముఖ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ తాజాగా చేసిన సర్వే ద్వారా చెబుతోంది. కాగా ఇప్పుడున్న 3జీ, 2జీ ఫోన్లు మరికొంత కాలం వరకు ఉంటాయని సర్వే బృందం తెలియజేసింది. 4జీ టెక్నాలజీ విస్తరిస్తే స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు.

English summary

This 2016 year that has just begun will be the year of large screens and videos, says a study by Micromax who was India's leading smartphone manufacturers