ప్రభాష్  అభిమానులకు బాహుబలి షాక్

Big Shock to Prabhas Fans

06:57 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Big Shock to Prabhas Fans

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి భారత చలన చిత్ర రికార్డులను తిరగ రాసిన చిత్రం బాహుబలి . స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి - ది బిగినింగ్ పేరుతో మొదటి పార్ట్ ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. మొదటి పార్ట్ ను 150 కోట్ల వ్యయంతో దాదాపు రెండు సంవత్సరాలు తీసిన ఈ చిత్రం 650 కోట్ల మార్కెట్ ను సాదించి రికార్డు నెలకొల్పింది . ఈ చిత్రానికి రెండో పార్ట్ గా రానున్న బాహుబలి-ది కన్క్లూజన్ పేరుతో రిలీజ్ చెయ్యనున్నారు.ఇప్పటికే ఈ చిత్రాన్ని 2016 లో రిలీజ్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో 2017 లోనే రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ ను బాహుబలి మొదటి పార్ట్ తో పాటు రెండో పార్టులో 40 శాతం షూటింగ్ సన్నీవేశాలను ను ఇప్పటికే పూర్తి చేసారు . అయితే మిగతా 60 శాతం షూటింగ్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఇప్పటికి ప్రారంభించకపోవడం తో ఈ సినిమా 2016లో రిలీజ్ కాబోదు అనే ఊహాగానలు ఊపందుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అందరు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ వార్త ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.

English summary

Big Shock to Prabhas Fans